చిత్రం: మళ్ళీరావా!
నటీనటులు: సుమంత్.. ఆకాంక్ష సింగ్.. అన్నపూర్ణ.. అభినవ్.. మిర్చి కిరణ్.. అప్పాజీ అంబరీష్.. సాత్విక్.. ప్రీతి అశ్రాని, అమాన్ తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: జి.సత్య
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
బ్యానర్: స్వధర్మ ఎంటర్టైన్మెంట్
కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
కథ :
మళ్ళీ రావా! అనే టైటిల్‌తో ఓ రొమాంటిక్ కథ. ఇద్దరు ప్రేమికులు మధ్య సాగే సినిమా. కార్తీక్(సుమంత్), అంజలి(ప్రేమికులు) తొమ్మిదో తరగతి నుండే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటుంది. అది ప్రేమ అని కూడా చెప్పలేనంత ఇష్టం. తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఇద్దరూ విడిపోతారు. అంజలి అమెరికా వెళ్లిపోతుంది. తర్వాత హైదరాబాద్‌లో ఓ ప్రాజెక్ట్ పని మీద వస్తుంది. అదే ఆఫీస్‌లో కార్తీక్ కనపడతాడు. మళ్లీ ఇద్దరూ ప్రేమలో పడతారు. అంజలిపై తనకున్న పేమ గురించి కూడా కార్తీక్ ఆమెతో చెబుతాడు. అంజలి తన మనసులో కార్తీక్‌పై ఉన్న ప్రేమలో వ్యక్త పరుస్తుంది. అంతే కాకుండా పెళ్లి చేసుకుందామనే ప్రపోజ్ కూడా పెడుతుంది. సరేనని రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకుంటాడు కార్తీక్. అక్కడకు వచ్చిన అంజలి..తనకు కార్తీక్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెబుతుంది. కానీ కార్తీక్ ఆమెను ఎమీ అనడు. మళ్లీ అంజలి అమెరికా వెళ్లిపోతుంది. ఐదేళ్ల తర్వాత కార్తీక్ ఆస్ట్రేలియా వెళ్లడానికి రెడీ అవుతాడు. అదే సమయంలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వస్తుంది అంజలి. అక్కడ కార్తీక్ ఆమెకు తారసపడతాడు. అసలు కార్తీక్‌ను అంజలిని ఎందుకు పెళ్లి చేసుకోదు? చిన్నప్పుడు కార్తీక్, అంజలి విడిపోవడానికి కారణాలేంటి? చివరకు ఇద్దరూ కలుసుకుంటారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
1999-2012-2017 ఇలా మూడు దశల్లో సాగే కథ ఇది. హృదయాన్ని హత్తుకునే ఓ ఫీల్‌గుడ్ చిత్రం. బాల్యంతో పాటు పెద్దయ్యాక ఓ జంట జీవితంలో సంఘర్షణను సమాంతరంగా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సాధారణ కథే అయినా, దాన్ని తనదైన స్క్రీన్‌ప్లేతో తెరపై తీసుకొచ్చాడు దర్శకుడు. అంజలి.. కార్తీక్‌ని వద్దనడానికి కారణమేంటి? అనే ప్రశ్న చివరి వరకూ వెంటాడుతూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ ఒక్క ప్రశ్న చుట్టూనే కథను తిప్పుతూ కొంచెం బాల్యం.. కొంచె యంగ్ ఏజ్ సన్నివేశాలను చూపిస్తూ కథను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రేమ కథతో పాటు మంచి హాస్యానికి ఇందులో చోటుంది. సాఫ్ట్వేర్ కంపెనీ నేపథ్యం, అక్కడి ఉద్యోగులు.. చిన్నప్పటి అంజలి ప్రేమ కోసం కుర్రాళ్లు పోటీపడే సన్నివేశాలు స్వచ్ఛమైన వినోదాన్ని పంచిపెడతాయి. కథలో మలుపులు, పతాక సన్నివేశాలు చిత్రానికి ప్రధాన బలం
పెర్ఫార్మన్స్ :
సుమంత, ఆకాంక్షసింగ్ తమ నటనతో చిత్రానికి ప్రాణం పోశారు. చిన్నప్పటి పాత్రలను పోషించిన సాత్విక్.. ప్రీతి ఆశ్రానిల నటన కూడా చాలా బాగుంది. సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్‌గా చేసిన మిర్చి కిరణ్ పాత్రతో పాటు, దంబు ఇతర స్నేహితుల పాత్రలు కూడా బాగా పండాయి. సాంకేతికంగా సినిమా స్థాయికి తగ్గట్టుగా కుదిరింది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం.. సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం కథలో ఫీల్‌ను ఎలివేట్ చేశాయి. దర్శకుడు గౌతమ్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. క్లిష్టమైన స్క్రీన్‌ప్లే రాసుకొని, దాన్ని ఏమాత్రం గందరగోళం లేకుండా తెరపైకి తీసుకొచ్చిన విధానం ఆకట్టుకంది. మాటలు కూడా బాగున్నాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయంతే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
– నటీనటుల పనితీరు
– కథనం
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
– సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
– స్లో నెరేషన్
– సినిమా ప్రారంభంలో కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని కాస్త తికమక పెడుతుంది.
ఫైనల్ వర్డ్ :
చివరిగా “మళ్ళీరావా! ” ఒక మంచి త్రిల్లింగ్ వున్న మూవీ.
రేటింగ్ : 2.5/5