Newsమెహ‌ర్ ర‌మేష్ కాదు… ముంచేసే ర‌మేష్… వామ్మో ఏం రాడ్ డైరెక్ట‌ర్‌రా...

మెహ‌ర్ ర‌మేష్ కాదు… ముంచేసే ర‌మేష్… వామ్మో ఏం రాడ్ డైరెక్ట‌ర్‌రా బాబు…!

మెహర్ రమేష్ ఈ పేరు చెబితేనే టాలీవుడ్ అగ్ర నిర్మాత‌లు, స్టార్ హీరోలు మాత్రమే కాదు చివరకు మీడియం రేంజ్ హీరోలు కూడా దూరంగా పారిపోయే పరిస్థితి. పూరి జగన్నాథ్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి బంధువు అవుతాడు. ఆ పేరు చెప్పుకుని సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. కన్నడంలో ఒకటి రెండు హిట్ సినిమాలు చేసిన మెహర్ రమేష్ ఆ తర్వాత తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో నాలుగు సినిమాలు చేస్తే అన్ని డిజాస్టర్లు అయ్యాయి.

పైగా అవన్నీ ఒకదానిని మించిన డిజాస్టర్లు మరొకటి. ఒక్క ప్రభాస్‌తో చేసిన బిల్లా రీమేక్ మాత్రం ఎబో మావ‌రేజ్‌ సినిమాగా నిలిచింది. ఎన్టీఆర్ తో చేసిన కంత్రి, శక్తి రెండు బిగ్‌ డిజాస్టర్లు. పైగా రెండు సినిమాలకు అశ్వినీద‌త్‌ నిర్మాత. శక్తి సినిమా అయితే మగధీరను మించి రికార్డులు కొట్టబోతున్నాం అంటూ మెహర్ రమేష్ ఎన్టీఆర్‌ను నమ్మించి నిలువునా ముంచేశాడు.

ఈ సినిమా దెబ్బతో టాలీవుడ్ లో కొన్ని సంవత్సరాల హిస్టరీ ఉన్న అగ్ర నిర్మాత అశ్వినీద‌త్ బెంబేలెత్తిపోయారు. ఆ సినిమాకు ఆ రోజుల్లోనే ఏకంగా 32 కోట్లకు పైగా భారీ నష్టం వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే ఆ సినిమాకు వచ్చిన నష్టం రు. 100 కోట్ల పైమాటే. అశ్వినీద‌త్‌ లాంటి వ్యాప‌కం ఉన్న నిర్మాత కోలుకుని సినిమాలు తీస్తున్నారు తప్ప.. అలాంటి నష్టం మరో నిర్మాతకు ఆ రోజుల్లో వచ్చి ఉంటే ఇండస్ట్రీని వదిలి ఎప్పుడో పారిపోయేవారు.

ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా మెహర్ రమేష్ గారికి ఎక్కించిన షాడో సినిమా మరో భయంకరమైన డిజాస్టర్. ఈ సినిమాకు కూడా వెంకటేష్ మార్కెట్ కు మించి భారీగా ఖర్చు పెట్టించారు. సినిమా డిజాస్టర్ అవడంతో సింహా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసిన పరుచూరి కిరీటి అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా ఇండస్ట్రీ నుంచి త్వరగా ఎగ్జిట్ అవ్వాలంటే మెహర్ రమేష్ తో ఒక్క సినిమా చేస్తే చాలు అన్నంతగా మెహర్ రమేష్ పరిస్థితి దిగజారిపోయింది.

షాడో వ‌చ్చి ప‌దేళ్లు దాటేసింది. ఇప్పటికీ మెహర్ రమేష్ ను ఎవరు దగ్గరికి కూడా రానివ్వటం లేదు. మధ్యలో మహేష్ బాబును పట్టుకుని ఒకటి రెండు ప్రకటనలను తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు అలాంటి మెహర్ రమేష్‌ను చిరంజీవి దగ్గరకు చేరదీసి భోళాశంకర్ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వటం ఎవరికి అంతుపట్టడం లేదు. పైగా అది తమిళంలోనే పెద్ద రాడ్‌ సినిమా.

దానిని తెలుగులో కూడా డబ్‌ చేశారు. అలాంటి సినిమాను మళ్ళీ చిరంజీవితో తెరకెక్కించడం అంటే చాలా పెద్ద రిస్క్. అందులోనూ మెహర్ రమేష్ లాంటి అత్యంత ప్రతిభావంతుడు అయినా డైరెక్టర్ కు ఈ సినిమా అవకాశం ఇవ్వటం అంటే చిరంజీవి తెలివితేటలు ఏమైపోయాయి ? అంటూ అభిమానులే తలలు పట్టుకుంటున్నారు.

ఎంత దారుణం అంటే శ‌క్తి సినిమాలో క‌థ‌ను మార్చాల‌ని అశ్వీనీద‌త్ అన్నారు. అలా లైన్ మారిప్లాప్ అయ్యింద‌ని మెహ‌ర్ ర‌మేష్ శ‌క్తి రిజ‌ల్ట్ అశ్వ‌నీద‌త్ ఖాతాలో వేసి తాను త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం మ‌రో ఘోరం. మ‌రి ఈ ముంచేసే ర‌మేష్ రేపు చిరంజీవిని భోళా శంక‌ర్ సినిమాతో ముంచుతాడా ? తేల్చుతాడా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news