మద్రాస్‌లోని విజయా గార్డెన్ కిక్కిరిసిపోయింది. అప్పుడే మిస్సమ్మ సినిమా కోసం ఆడిషన్లు జరుగుతున్నా యి. భానుమతిని ఎంపిక చేసుకున్నారు. ఈమె మిస్సమ్మగా నటించాలి. ఓకే చెప్పారు. కానీ, ఆమె చెల్లెలు గా.. నటించేందుకు ఎవరూ లేకుండా పోయారు. అప్పటికే చిన్న చిన్న పాత్రలు చేస్తున్న జమునను స్వయంగా రేలంగి వెంకట్రామయ్యగారే తీసుకు వచ్చారు. ఈమెను తీసుకోండి..! అన్నారు.
అప్పట్లో రేలంగి మాటకు అంత వాల్యూ ఉండేది. అయితే.. మిస్సమ్మ దర్శకుడు ఎల్ వీ ప్రసాద్. ఆయన అగ్ర దర్శకుడు. పైగా పేరు కోసం తపిస్తారు. రామారావ్. మనం ఎన్నిచేశామనేది ముఖ్యంకాదు.. సంఖ్యా బలం కన్నా.. స్థాపనా బలం ఎక్కువగా ఉండాలి. ఎక్కువ కాలం నిలిచిపోవాలి
అని పదే పదే చెప్పేవారు. అందుకే ప్రతి ఒక్కరికీ స్క్రీన్ టెస్ట్ చేసే ఈ సినిమాను రూపొందించారు.
మిస్సమ్మ సినిమా తీసేందుకు మూడు సంవత్సరాలు సమయం తీసుకున్నారు. ఇక, జమున విషయానికి వస్తే.. ఈ అమ్మాయి పీలగా ఉంది
అని ఎల్‌వీ ప్రసాద్ అనేశారు. `సర్ మీరు స్క్రీన్ టెస్ట్ చేసే కదా తీసుకుంటారు. నచ్చితేనేతీసుకోండి..!
అన్నారు రేలంగి. దీంతో స్క్రీన్‌టెస్ట్ చేశారు. చివరలో బాగానే ఉందన్న దర్శకుడు.. జమునను ఉద్దేశించి.. అమ్మాయి (ఆయన హీరోయిన్లను అలానే పిలిచేవారు. ఒక్క భానుమతిని తప్ప) సినిమాల్లో చేయాలంటే సిగ్గు-బిడియం వదిలేయాలి తెలిసిందా! అన్నారు.
సరేనండి..! అన్న జమున.. తర్వాత నుంచి జంప్. నేను చేయను అని భీష్మించారు. రేలంగికి టెన్షన్. ఎందుకంటే ఎల్‌వీ ప్రసాద్‌ను ఆయన ఒప్పించి ఓకే చేశాక.. జమున చేయనని చెప్పారు. తర్వాత.. నెమ్మదిగా ఆమెను ఒప్పించే సరికి చాలా సమయం పట్టింది. సెకండ్ హాఫ్ నుంచి జమున పాత్ర మనకు కనిపిస్తుంది. అలా ఎంట్రీ ఇచ్చిన జమున తర్వాత కాలంలో సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు.