మహానటి సావిత్రి గురించి అందరికీ తెలిసిందే. ఆమె జీవితం ఆధారంగా చిత్రం కూడా మహానటి పేరుతో వచ్చింది. అనతి కాలంలో ఎదిగిన మహానటి సావిత్రి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించి.. దశాబ్దం పాటు.. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకు న్నారు. అయితే.. ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహం అయిన.. జెమినీ గణేశన్‌ను సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జెమినీ గణేశన్.. ఒక వివాహం చేసుకున్నారు. అయినా.. సావిత్రి ఇష్టపడి చేసుకున్నారు.
సావిత్రి-జెమినీకి పిల్లలు కూడా పుట్టారు. తొలి భార్య పిల్లల్లో రేఖ(బాలీవుడ్ హీరోయిన్) గురించి అందరికీ తెలిసిందే. ఇక, మధ్యలో వ్యసనాలకు బానిసైన జెమినీ.. సావిత్రమ్మ సంపాయించిన ఆస్తులను ఖర్చు చేసారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఇదిలావుంటే.. సావిత్రితో విభేదాలు వచ్చాయి. దీంతో జెమినీ గణేశ్.. ఆమె నుంచి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఒక కాస్ట్యూమ్ డిజైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె జెమినీ జీవితంలో వచ్చిన మూడో భార్య.
ఇక, వీరికి కూడా మరో ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే.. అనూహ్యంగా ఈమె మధ్యలోనే జెమినీకి విడాకులు ఇచ్చి వేరే వారితో జంప్ అయిందనే ప్రచారం ఉంది. మరోవైపు.. సావిత్రి మరణించింది. తొలి భార్య మాత్రం జీవించి ఉన్నా.. దూరంగా ఉంటోంది. దీంతో జెమినీ.. దాదాపు 60 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 28 ఏళ్లు. ఎక్కడో పరిచయం..పెళ్లిగా మారింది.
అయితే.. జెమినీతో ఆమె కాపురం చేయలేదని.. ఆయన ఆస్తుల కోసం వివాహం చేసుకుందనే ప్రచారం ఉంది. ఇక, చివరి దశలో తనతో కాపురం చేయలేదన్న వివాదం పెట్టుకున్న జెమినీని చెంబుతో కొట్టిందని.. బాత్‌రూం పాడుచేశాడంటూ.. చీవాట్లు పెట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో జెమినీ విషయం తెలిసిన వారు సరైన శాస్తి జరిగిందని ఎద్దేవా చేసేవారు.