మూడు సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్నా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఎట్టకేలకు శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. సినిమా తొలి ఆటకే అరివీర భయంకరమైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అఖిల్ ఆశలు ఆవిరి చేసేసింది. ఇది ఇలా ఉంటే గత యేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా వచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల డిజాస్టర్ వెనక ఒక కామన్ పదం కనిపిస్తోంది. అదే సాలా.. ఇది ఒక హిందీ పదం. దీనికి తెలుగులో బావమరిది అని అర్థం వస్తుంది. అయితే అదేదో తిట్టు మాదిరిగా ఈ పదాన్ని తయారు చేసేసారు. నార్త్ బెల్ట్ లో సాలా సాలా అంటూ మాట్లాడటం కామన్. ఆ హిందీ డైలాగులు పూరి జగన్నాథ్ కు బాగా ఇష్టం. అందుకే లైగర్ సినిమా తీసి సాలా క్రాస్ బ్రీడ్ అనే పదం మన మీదకు వదిలాడు.
సినిమా భయంకరమైన ప్లాప్ అయింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి అఖిల్‌తో ఏజెంట్ సినిమా తీశాడు. అక్కడితో ఆగకుండా దానికి వైల్డ్ సాలా అన్న పదం యాడ్ చేశారు. సాలా అంటేనే పవర్ ఫుల్ తిట్టు అని ఫీల్ అవుతుంటే… వైల్డ్ సాలా అన్నది ఇంకా పవర్ఫుల్ గా ఉంటుందని ఆలోచించినట్టు ఉన్నారు. సేమ్ లైగర్ సెంటిమెంట్ ఏజెంట్‌కు కూడా రిపీట్ అయ్యి ఇది కూడా డిజాస్టర్ అయ్యింది.
దీనిని బట్టి చూస్తే సాలా అన్నది తెలుగు సినిమాలకు పెద్దగా అచ్చి రాలేదని చెప్పాలి. టాలీవుడ్ అంటేనే
సెంటిమెంట్ వరల్డ్. ఇక ఫ్యూచర్ లో ఈ సాలా పదం వాడడానికి మనోళ్లకు బాగా భయం పట్టుకునేంత గొప్ప రిజల్ట్ ఇచ్చాయి ఏజెంట్, లైగర్.