పూరి జగన్నాథ్ ఒక హిట్లు.. ఐదారు ప్లాపుల డైరెక్టర్. కెరీర్ ప్రారంభం నుంచి పూరి కొట్టక కొట్టక ఒక్క హిట్ కొడతాడు. ఆ వెంటనే ఐదారు ప్లాపులు పడతాయి. టెంపర్‌కు ముందు పూరికి బిజినెస్‌మేన్ అన్న హిట్టు వచ్చినట్టు గుర్తు. ఆ తర్వాత టెంపర్ వరకు అడ్రస్ లేడు. టెంపర్ పేరు చెప్పుకుని ఐదారేళ్లు బతికేశాడు. వరుసగా ఐదారు ప్లాపులు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో లక్ చిక్కింది. ఛార్మీ ఫ్రెండో ఏమో తెలియదు కాని ఛార్మీ కూడా నిర్మాత.
వెంటనే కాళ్లు ఆకాశంలోకి వెళ్లిపోయాయి. పాన్ ఇండియా అంటూ లైగర్ తీస్తే జనాలు చీదరించుకున్నారు. ఇక్కడ కూడా ఛార్మీదే పెత్తనం అంతా..! అసలు విజయ్ దేవరకొండ కెరీర్లోనే అతి భయంకరమైన సినిమాగా మిగిలిపోయింది. ఆ దెబ్బతో పూరి పేరు చెపితేనే ఇండస్ట్రీ జనాలు ఎవ్వరూ దగ్గరకు రానియ్యడం లేదు. బాలయ్య నామస్మరణ చేశాడు.. బాలయ్య ఇప్పుడు టాప్ డైరెక్టర్ల లైనప్‌లో ఉన్నాడు.
లైగర్ దెబ్బతో అప్పటికే స్టార్ అయిన విజయ్ దేవరకొండ జనగణమన ఆగిపోయింది. ఇక విజయ్ భవిష్యత్తులోనూ పూరికి ఛాన్స్ ఇస్తాడని అనుకోలేం. అయితే ఇప్పుడు పూరి అటూ ఇటూ తిరిగి ఇస్మార్ట్ శంకర్ పేరు చెప్పేసి రామ్‌ను బుట్టలో వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పూరి ఇస్మార్ట్ శంకర్ – 2 అంటున్నాడట.
ప్రస్తుతం రామ్ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా దసరా బరిలో ఉంది. ఆ సినిమా షూటింగ్ అయిన వెంటనే పూరి – రామ్ ఇస్మార్ట్ శంకర్ 2 పట్టాలు ఎక్కనుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది. ఏదేమైనా ఛార్మీ, పూరి ఎవరు దొరుకుతారా ? అని గత కొద్ది నెలలుగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వీరి బుట్టలో రామ్ పడ్డాడు. మరి రామ్ ఈ సారి సేఫ్ అవుతాడా ? బకరా అవుతాడా ? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.