MoviesNBK108: తారకరత్న రోల్ లో ఆ స్టార్ హీరో..స్వయంగా సెలక్ట్ చేసిన...

NBK108: తారకరత్న రోల్ లో ఆ స్టార్ హీరో..స్వయంగా సెలక్ట్ చేసిన బాలయ్య..ఇక దబిడి దిబిడే..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్న సినిమా ఎన్బికె 108 . మల్టీ టాలెంటెడ్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి నటసిం హం బాలయ్య డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు . ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి నందమూరి అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఇంతవరకు మాస్ యాంగిల్ లోనే చూసిన బాలయ్యను ఈసారి క్లాస్ యాంగిల్ లో కూడా టచ్ చేయబోతున్నాడు అనిల్ రావిపూడి అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు బాలయ్యలోని కామెడీ యాంగిల్ కూడా ఈ సినిమాలో బయట పెట్టబోతున్నాడు అనిల్ రావిపూడి అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్బికె 108 కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాల్సిన తారకరత్న పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్న అర్జున్ కపూర్ సెలెక్ట్ అయినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . మనకు తెలిసిందే అనిల్ రావిపూడి ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ పాత్రలో తారకరత్నను చూపించాలి అని అనుకున్నాడు. క్యారెక్టర్ కూడా ఫైనలైజ్ చేసాడు.

రేపో మాపో అగ్రిమెంట్ పై సైన్ చేసి షూట్ అనగా తారకరత్న గుండెపోటుతో మరణించారు . ఈ క్రమంలోని ఆ పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని బాలయ్య స్వయంగా ఈ డెసిషన్ తీసుకున్నాడట . అంతేకాదు అర్జున్ కపూర్ – బాలయ్య కాంబోలో వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకి హైలెట్గా డిజైన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . బాలయ్య కోసం బాలీవుడ్ హీరో తెలుగు సినిమాలో విలన్ గా నటించబోతున్నాడా..? వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు బాలయ్య ఒక్కసారి తొడ కొడితే అర్జున్ కపూర్ కి ఇక దబిడి దిబిడే అంటూ బాలయ్య డైలాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే అందుతున్న అప్డేట్స్ చూస్తుంటే కచ్చితంగా ఎన్బికె 108 ఇండస్ట్రీ చరిత్రను తిరగరాయబోతుంది అంటూ నందమూరి అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news