అంతస్తులు సినిమా. 1965లో వచ్చిన సూపర్ మూవీ. ఇది జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ తీసింది. వి. బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. వి. మధుసూదన రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రధాన పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, కృష్ణకుమారి నటించారు, కె. వి. మహదేవన్ సంగీతం స్వరపరచాడు. ఈ చిత్రం 1965 సంవత్సరంలో తెలుగు సినిమాలలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందింది. ఈ సినిమాలో ధనము, అధికారము గల జమిందారి జీవితాన్ని ఆవిష్కరించారు.
అదే సమయంలో జమీందారుగా చెలామణి అవుతూనే.. సమాజంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకున్న వ్యక్తి గా కూడా ఈసినిమా చూపిస్తుంది. అయితే.. ఈ సినిమాలో భానుమతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఈ సిని మాలో చాలా పాటలు సూపర్ హిట్ కొట్టాయి. `నిను వీడని నీడను నేనే
పాట ఈ సినిమాలోదే. హీరో హీరోయిన్లుగా కృష్ణకుమారి-అక్కినేని నటించారు. ఇక, హీరోకు చెల్లి పాత్రలో భానుమతి నటించింది.
సినిమా అంతా కూడా.. ఫస్ట్ హాఫ్ వరకు .. భానుమతికి పెద్దగా పాత్రలేదు. కానీ, తర్వాత మాత్రం మొత్తం సినిమా అంతా కూడా.. భానుమతి చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో భానుమతి ఎలివేషన్ ఎక్కువ. కృష్ణకుమారి పాత్రకు ఎలివేషన్ తక్కువ. ఈ ఉద్దేశంతోనే భానుమతి క్యారెక్టర్ పాత్రనునటించారని అంటా రు. పైగా.. ఆమెకు క్యారెక్టర్ పాత్రే ఇచ్చినా.. రెండు అదిరిపోయే సాంగ్స్ కూడా చెప్పారు. మొత్తానికి ఈ సినిమాలో విభిన్నంగా భానుమతి నటించారు.
ఇక, ఈ సినిమాకు జాతీయ అవార్డుల లభించింది. దీంతో వీబీ రాంజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా తెలుగు నటుల కోసం. ఈ సినిమాను జెమినీ స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సినిమాను అన్నగారు ఎన్టీఆర్ కూడా వీక్షించారు. భానుమతి నటనకు ముగ్దులయ్యారు. ఆ తర్వాత.. ఎన్టీఆర్, భానుమతి కాంబినేషన్‌లో రెండు మూడు సినిమాలు రావడం విశేషం.