టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి కూతురు సుప్రీతకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో తల్లితో కలిసి వీడియోలు చేసిన సుప్రీత ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. వరుస ఫోటో షూట్ లు, వీడియోలు రిలీజ్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. సుప్రీత చేస్తున్న రీల్స్ విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే టీవీ షో లలో కూడా సుప్రీత సందడి చేస్తోంది.
ఇక కూతురును స్టార్ హీరోయిన్ చేయాలనే ఆలోచనలో సురేఖవాణి ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సుప్రీత గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కూతురులా కాకుండా అక్కా చెల్లెళ్ల మాదిరాగా పార్టీలు ఫంక్షన్లకు వెళుతూ ఉంటారు. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ఎలాంటి విమర్శలు వచ్చినా సుప్రీత అసలు పట్టించుకోదు.
ఇదిలా ఉంటే గతంలో సుప్రీత తన జీవితానికి సంబంధించిన కీలక ప్రకటన చేసింది. తాను ప్రేమలో ఉన్నానని తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. నేను ఓకే చెప్పాను…. అంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు గతంలో నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అతడు సింగర్ అని తెలుస్తోంది. అతడి పేరు రాఖీ జోర్డాన్ … పలు ర్యాప్ సాంగ్ లకు ఇతను ఆల్బమ్స్ కూడా చేశాడు. అంతేకాకుండా ఎక్కువగా అమెరికాలో ఉంటాడు.
అయితే ఆ తరవాత సుప్రీత బాయ్ ఫ్రెండ్ గురించి ఎలాంటి పోస్ట్ లు పెట్టలేదు. అంతే కాకుండా సుప్రీత ఎమోషనల్ స్టేటస్ లు పెట్టడం..బ్రేకప్ స్టేటస్ లు పెట్టడంతో బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిందా..? అన్న అనుమానాలు నెటిజన్ లకు మొదలయ్యాయి. మరోవైపు రాకీ జోర్దాన్ కూడా ఎప్పుడూ సుప్రితతో కలిసి దిగిన ఫోటోలను కానీ…. వారి ప్రేమకు సంబంధించిన విషయాలను కానీ షేర్ చేయలేదు.
దాంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఉంటారని కొంతమంది ఆమె ఫాలోవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మరికొందరు మాత్రం వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా కొనసాగించాలని అనుకుంటున్నారని అందువల్లే ఎలాంటి పోస్ట్ లు పెట్టడం లేదని చెబుతున్నారు.