Moviesరొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు హీరోయిన్లు టెంప్ట్ అయితే కమిటైపోతారా...!

రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు హీరోయిన్లు టెంప్ట్ అయితే కమిటైపోతారా…!

సినిమా తీయ‌డం అంటే అంత సులువైన విష‌యం కాదు చాలా క‌ష్ట‌పడాల్సి ఉంటుంది. ఒక్క సినిమా కోసం వేల మంది ప‌నిచేయాల్సి ఉంటుంది. న‌టీన‌టులు టెక్నీషియ‌న్స్, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు, జూనియ‌ర్ ఆర్టిస్ట్ లు ఇలా ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టం తోడ‌వుతేనే ఒక సినిమా బ‌య‌ట‌కు వ‌స్తుంది. అయితే సినిమా షూటింగ్ ను న‌టీన‌టులు చాలా ఎంజాయ్ చేస్తార‌ని ఎప్పుడూ షూటింగ్ లు చూడ‌ని వారు అనుకుంటూ ఉంటారు. అంతే కాకుండా హీరోహీరోయిన్ లు చాలా ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తారు.

ఇక కొన్ని సినిమాల మేకింగ్ వీడియోలు చూసిన‌ప్పుడు కూడా మ‌న‌కు అలాంటి సీన్ లే క‌నిపిస్తాయి. న‌టీన‌టులు న‌వ్వుతూ స‌ర‌దాగా కనిపిస్తుంటారు. దాంతో షూటింగ్ అంటే క‌చ్చితంగా ఎంజాయ్ చేస్తార‌ని ఇక రొమాంటిక్ సీన్ లు అంటే హీరోహీరోయిన్ ల‌కు పండ‌గే అని కూడా అనుకుంటారు. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ రొమాంటిక్ స‌న్నివేశాల‌లో న‌టించేట‌ప్పుడు తన అనుభ‌వాల‌ను షేర్ చేసుకుంది.

ఆ వివ‌రాలు ఇప్పుడు చూద్దాం…ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ మాట్లాడుతూ…..మీరు రొమాంటిక్ స‌న్నివేశాల‌లో న‌టిస్తుంటారు. అలాంటి స‌మ‌యంలో టెంప్ట్ అయిపోతారా అని అడిగేశాడు. అక్క‌డి తో ఆగ‌కుండా ఒక‌వేళ టెంప్ట్ అయిపోతే ఆ త‌ర‌వాత క‌మిట్ అవుతారా అంటూ ప్ర‌శ్నించాడు. ఆ ప్ర‌శ్న‌తో హీరోయిన్ కు కోపం వ‌చ్చిన‌ప్ప‌టికీ యాంక‌ర్ కు మాత్రం సున్నితంగానే స‌మాధానం ఇచ్చింది.

సినిమా షూటింగ్ అంటే కేవ‌లం నాలుగు గోడ‌ల మ‌ధ్య ఇద్ద‌రు మాత్ర‌మే ఉండి చేసేది కాద‌ని చెప్పింది. షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కెమెరా మెన్ డైరెక్ట‌ర్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఇలా చాలా మంది ప‌క్క‌నే ఉంటారని తెలిపింది. తాను మొద‌టి సారి రొమాంటిక్ సీన్ న‌టిస్తున్న స‌మ‌యంలో టెంప్ట్ అవుతానేమో అని భ‌య‌ప‌డిపోయాన‌ని కానీ ఆ ప‌రిస్థితిలో ఎలాంటి ఫీలింగ్స్ రావ‌ని చెప్పింది. ఇక హీరోలు కూడా త‌మ‌తో స్నేహంగా ఉంటార‌ని కాబ‌ట్టి ఎలాంటి ఫీలింగ్స్ రావ‌ని స్ప‌ష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news