టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో శైలజా ప్రియ కూడా ఒకరు. ఒకప్పుడు సినిమాల్లో అక్క వదిన పాత్రలు చేసిన ఈ నటి ప్రస్తుతం హీరో హీరోయిన్ లకు తల్లి పాత్రలలోనూ నటిస్తోంది. అంతే కాకుండా సినిమా ఆఫర్ ల కంటే సీరియల్స్ లో ఎక్కువ అవకాశాలు రావడంతో సీరియల్స్ కూడా రానిస్తోంది. శైలజా ప్రియ ఏపీలోని గుంటూరులో జన్మించారు. చిన్ననాటి నుండే సినిమాల పై ఆసక్తి ఉండగా మొదటిసారి చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది.
అంతే కాకుండా ఆ తరవాత ప్రియసఖి సీరియల్ లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సీరియల్ కు అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. అంతే కాకుండా ఈ సీరియల్ తోనే పాపులారిటీ రావడంతో ఆ తరవాత మరికొన్ని సీరియల్స్ తో పాటూ హిందీ సీరియల్స్ లో కూడా ప్రియా ఆఫర్ లు అందుకున్నారు. సినిమాల విషయానికి వస్తే చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించిన తరవాత మావిడాకులు, గోకులంలో సీత, అన్నయ్య, జయం మనదేరా, ఢమరుకం, మిర్చి, రారండోయ్ వేడుక చూద్దాం, బాబు బంగారం, విన్నర్ లాంటి సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో నటించింది.
సినిమాలలో కేవలం ఎమోషనల్ పాత్రలలోనే కాకుండా కామెడీ పాత్రలలో సైతం నటిస్తోంది. శైలజా ప్రియ తన సినిమా కెరీర్ లో మొత్తం 100 కు పైగానే చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే శైలజా ప్రియా పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె జీవితంలో సినిమాకు మించిన మలుపులు ఉన్నాయి. శైలజా ప్రియా 2002 సంవత్సరంలో కిషోర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.