మంచు ఫ్యామిలీలో బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య గత కొంత కాలంగా విబేధాలు నడుస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జరిగిన ఒకటి రెండు పరిణామాలు కూడా అందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. విష్ణు … వాళ్ల బంధువుల ఇంట్లోకి చొరబడి వాడు యేడి ? ఏదో అన్నాడుగా అని ఫైర్ అవ్వడం.. అక్కడ ఉన్న వాళ్లు విష్ణును కూల్ చేయడం.. మనోజ్ చూశారా… బంధువుల ఇంటిమీద పడి కొట్టడానికి వస్తున్నాడంటూ ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగాయి.
ఆ తర్వాత మనోజ్‌కు.. మోహన్‌బాబు వార్నింగ్ ఇవ్వడం.. ఈ వీడియో డిలీట్ చేయడం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదంతా ఫన్నీ వీడియో అంటూ విష్ణు కవరింగ్ ఇచ్చేందుకు ట్రై చేసినా జనాలు అవి నమ్మలేదు. తర్వాత మంచు లక్ష్మి కూడా అది ఫన్నీ వీడియో కాదని చెప్పేసింది. ఇక తాజాగా మనోజ్ తన భార్య మౌనికకు ప్రేమతో అంటూ ఓ మధురమైన పాటను జోడించి.. పెళ్లి విజువల్స్‌తో కూడిన వీడియో వదిలాడు.
4 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియోలో మనోజ్, మౌనికతో పాటు మంచు లక్ష్మి, బంధువులు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. అయితే అన్న మంచు విష్ణు మాత్రం అలా తళుక్కున మెరిసి వెళ్లిపోయాడు. విష్ణుకు చిన్న సింగిల్ ప్రేమ్ మాత్రమే ఇచ్చాడు మనోజ్. అసలు ఆ మాటకు వస్తే ఈ పెళ్లికే విష్ణు, ఆయన భార్య గెస్ట్ అప్పీరియన్స్‌లా వచ్చి వెళ్లారు.
ఇప్పుడు తన భార్యకు గిఫ్ట్‌గా ఇచ్చిన సాంగ్‌లోనూ విష్ణుకు ప్రయార్టీయే లేదు. అసలు తమ్ముడు పెళ్లికి వెళ్లేందుకు కూడా మనోజ్‌కు ఇష్టం లేదని.. చివర్లో బలవంతంగా బంధువులు ఒత్తిడి చేస్తే వెళ్లారనే అంటున్నారు. కనీసం తాళి కట్టాక విష్ణు దంపతులు ఆశీర్వదిస్తున్నట్టుగా ఓ ఫ్రేమ్ అయినా పెడితే బాగుండేది. ఏదేమైనా మంచు బ్రదర్స్ మధ్య ఆ గ్యాప్ అలా పెద్దది అవుతున్న వాతావరణమే ఉందంటున్నారు. అందుకే మరోసారి అన్నను సింగిల్ ఫ్రేమ్కే మనోజ్ పరిమితం చేశాడంటున్నారు.