చెన్నై చిన్నది సమంత నటించిన శాకుంతలం సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి దిగింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత బ్రాండ్ వేల్యూ పెరిగిందా ? పడిపోయిందా ? అన్న దానిపై రకరకాల రూమర్లు, చర్చలు ఉన్నాయి. చాలా మంది అక్కినేని ఫ్యామిలీ కోడలు హోదా పోయాక ఆమె కెరీర్ డౌన్ అవుతుందనే అనుకున్నారు. అయితే సమంత పుష్ప సినిమాలో ఐటెం సాంగులో రెచ్చిపోయి మరీ అందాలు చూపించేసింది.
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్. ఆ తర్వాత చేసిన వెబ్ సీరిస్‌లు సక్సెస్ అయ్యాయి. ఇక సిటాడెల్ వెబ్ సీరిస్‌లో ఛాన్స్. ఇటు యశోద సినిమా కూడా గట్టెక్కేసింది. దీంతో ఇక సమంతకు తిరుగు ఉండదనే ప్రచారం జరిగింది. సమంత కూడా యశోద టైంలో సెంటిమెంట్ గేమ్ ప్లే చేసింది. ఇక శాకుంతలం కోసం అయితే ఏకంగా పర్సనల్ విషయాలు, విడాకుల విషయాలు చెప్పి మరీ ఎమోషన్ గేమ్ ఆడింది.
అయితే శాకుంతలం పెద్ద డిజాస్టర్. అసలు సమంత కన్నా కూడా ఈ సినిమాలో భరతుడు పాత్ర చేసిన అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ పాత్రకే ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక శాకుంతలం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన తొలి రోజే 20 శాతం ఆక్యుపెన్సీ.. అది కూడా తెలుగులో కూడా రాబట్టుకోలేకపోయింది. దీంతో ఒక్క రోజులోనే సమంత బ్రాండ్ వేల్యూ మటాష్ అయిపోయింది.
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె నెక్ట్స్ ప్రాజెక్టుల మీద అంచనాలు కూడా తల్లకిందులు అవుతున్నాయి. ఇక సమంత డిప్రెషన్ లోకి వెళ్లిందని.. ఆమె తన ఫోన్ ను స్విచాఫ్ చేసేసిందని అంటున్నారు. ఆమె తన క్లోజ్ సర్కిల్స్‌కు కూడా అందుబాటులో లేదట. ఒక్క రోజులోనే సమంత బ్రాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ పడిపోయిందన్నది ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ ?