ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే .. అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల రిలేషన్ షిప్ వైరల్ గా మారింది . వీళ్లు నిజంగా ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ ..సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేసేస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ జంట కూడా ఈ మధ్యకాలంలో పలుసార్లు మీడియా కంట జంటగా కనపడడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
కాగా ఇదే విషయాన్ని నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ ని లైవ్ లో అడిగేసాడు ఓ రిపోర్టర్ . మనకు తెలిసిందే అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఏజెంట్ . ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అఖిల్ కు టఫ్ ప్రశ్న ఎదురైంది .”మీ అన్న నాగచైతన్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫోటోలో కనిపించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నారు.. మరి మీ పరిస్థితి ఏంటి ..?”అంటూ రిపోర్టర్ సూటిగా ప్రశ్నించాడు.
అయితే అఖిల్ మాత్రం చాలా తెలివిగా ఆన్సర్ ఇస్తూ.. తన అన్న నాగచైతన్య ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. “రెండేళ్లుగా నేను నా బాడీని.. నా జుట్టుని పెంచుకోవడానికి సరిపోతుంది.. ప్రస్తుతం నా ఫోకస్ అంత సినిమాలపైనే ” అంటూ పరోక్షంగా తన అన్నకు తనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆ ప్రశ్న స్కిప్ చేసేసాడు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అయితే ఇదే టైంలో కొందరు అక్కినేని ఫ్యాన్స్ శోభిత ధూళిపాళ్లను వదినమ్మ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది .
అంతేకాదు సమంతను అక్కినేని అఖిల్ వదినమ్మ అంటూ పిలుస్తాడు. ఇదే మూమెంట్లో ఆయన మాట్లాడిన వీడియో కింద శోభిత ని వదినమ్మ అంటూ అక్కినేని అభిమానులు కామెంట్ చేయడంతో ఆల్మోస్ట్ అక్కినేని నాగచైతన్య పెళ్లి శోభితా ధూళిపాళ్లతో ఫిక్స్ అయిపోయిందన్న కాన్ఫిడెన్స్ అక్కినేని అభిమానుల్లో ఎక్కువ కనిపిస్తుంది అంటున్నారు జనాలు. చూడాలి మరి దీనిపై అక్కినేని నాగచైతన్య ఎలా స్పందిస్తాడో..?