ఎన్టీఆర్ బయోపిక్ .. ఈ బయోపిక్ వ్యవహారరం తెలుగు సినీ పరిశ్రమను షాక్ చేసి ఎన్నో వివాదాలు , మరెన్నో సంచలనాలకు మారుపేరుగా మారిపోయింది. అప్పట్లో అందరి నోళ్ళల్లోనూ తెగ నానిన ఈ వ్యవహారం కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యింది కాయాన్ని మల్లి ఇప్పుడు తెరమీదకు వచ్చింది.
అసలే ఈ బయోపిక్ వ్యవహారం లో వివాదాలా దర్శకుడు వర్మ కూడా ఎంటర్ అయిపోవడంతో ఈ టాపిక్ మరింత వేడెక్కింది.
బాలయ్య కూడా నాన్న గారి బయోపిక్ రెడీ అవుతోందని ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టేశాడు. ఎవరు ఊహించని విధంగా దర్శకుడిగా తేజ ను కూడా ఫైనల్ చేశారు. వర్మ సంగతి పక్కన పెడితే బాలకృష్ణ తీయబోయే బయోపిక్ ఎప్పుడు మొదలు పెడతారా అని అందరు చర్చించుకోవడం ప్రారంభించారు.
ఈ బయోపిక్ షూటింగ్ జనవరిలోనే మొదలుపెట్టి వచ్చే ఎన్నికల లోపు రిలీజ్ చెయ్యాలని బాలయ్య భావించాడు. మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. కానీ ప్రస్తుతం బాలకృష్ణ ఈ పనులను ఆపేసాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా మే 28న ఘనంగా స్టార్ట్ చేయాలనీ బాలయ్య చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే దర్శకుడు తేజ ఆ లోపు మరొక సినిమాను ఒప్పుకోవటానికి రెడీ అవుతున్నాడు. గత కొంత కాలంగా వెంకీతో ఓ సినిమాను చేస్తాడని వస్తోన్న వార్తల గురించి తెలిసిందే. అయితే డిసెంబర్ లో వెంకీతో సినిమాను మొదలు పెట్టి తొందరగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడు. ఇక తర్వాత తేజ పూర్తిగా ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆలోచిస్తాడని వార్తలు ఫిలిం నగర్ నుంచి వినిపిస్తున్న్నాయి.