సినీ రంగం అంటేనే.. ఒక మాయా జూదం- అంటారు మహాకవి శ్రీశ్రీ. ఇక్కడి సోపాన పటంలో ఎదిగిన వారు.. కిందకు జారిపోయిన వారు అనేక మంది ఉన్నారు. కనీసం ఇల్లు గడిస్తే.. చాలు అనుకుని సినీ బాట పట్టిన పద్మనాభం వంటివారు.. సినీరంగంలో మెరుపులు కురిపించారు. సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగారు. ఇక, వారసత్వంగా సినీమాల్లోకి వచ్చి.. మెరుపులు మెరిపిద్దామని అనుకున్నవారు చాలా మంది విఫలమయ్యారు.
అయితే.. విఫలమైన వారే కాకుండా.. దాదాపు 50 ఏళ్ల వయసు వరకు పెద్దగా గుర్తింపు లేని వారసులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు కృష్ణ కుమారుడు మహేష్.. చిన్న వయసులోనే ఎలివేట్ అయ్యారు. కానీ, మరో కుమారుడు రమేష్ సక్సెస్ కొట్టలేక పోయారు. ఇద్దరూ కృష్ణ కుమారులుగానే రంగంలోకి వచ్చారు. ఇక, అక్కినేని కుమారుడు నాగార్జున కూడా ఇంతే.. ఆయన 20 ఇయర్స్‌లోనే మంచి సినిమాలు చేశారు. కానీ, హిట్ కొట్టి సినిమాలు చూస్తే.. తక్కువే.
శివ సినిమాతో హిట్ కొట్టినా లాంగ్ గ్యాప్ వచ్చింది. 50 ఏళ్ల తర్వాత నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోకుం డా ఉన్నారు. దిగ్గజ నిర్మాత రామానాయుడు చిన్న కుమారుడు వెంకటేష్ హీరోగానే అరంగేట్రం చేసినా.. వెంకటేష్ హిట్టయ్యారు. వెంకట్ మాత్రం.. అసలు తొలి సినిమాతో మధ్యలోనే విరమించుకున్నారు. అన్నగారు ఎన్టీఆర్ కుమారులు.. బాలయ్య, హరికృష్ణల్లో ఎవరు హిట్టో తెలిసిందే. బాలయ్యకు కూడా కెరీర్ ప్రారంభం తర్వాత పాపులర్ అయ్యారు.
ఆ తర్వాత మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఆయన క్రేజ్ డల్ అయ్యింది. ఇక ఇప్పుడు బాలయ్య జోరుకు బ్రేకులు వేసేవాడే లేడు. బాలయ్యకు 50 ఏళ్ల తర్వాత.. వచ్చిన గుర్తింపే చాలా ఎక్కువ. అయితే.. వారిలో టాలెంట్ లేదని కాదు.. కానీ, అప్పటికి ఇంకా.. అన్నగారు.. అక్కినేని.. శోభన్‌బాబు, కృష్ణ వంటివారు ఫీల్డ్ లోనే ఉండడంతో వారసులు పెద్దగా ఎలివేట్ కాలేదనే టాక్ ఉంది. ఏదేమైనా.. 50 ఏళ్ల తర్వాతే వీరు అశేష ఆదరణ పొందారని చెప్పాలి. ఇక, చిరు కుటుంబం నుంచి ఆయన సోదరులు ఇద్దరు వచ్చినా నాగబాబు సక్సెస్ కొట్టలేకపోయారనే విషయం తెలిసిందే.