సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో వెంకటేష్ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పుడంటే సార్ రేంజ్ తగ్గిపోయింది కానీ అప్పట్లో వెంకటేష్ పేరు చెప్తే ఫ్యామిలీ లేడీస్ కూడా చీర నడుముకు బిగించుకొని పరిగెత్తుకుంటూ థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసేవాళ్ళు. అలాంటి ఒక్క రికార్డులు స్థాపించుకున్నాడు వెంకటేష్ . మరీ ముఖ్యంగా అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాఎలాంటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతెందుకు ఇప్పటికే ఆ సినిమా టీవీలో వస్తే ఈ జనరేషన్ పిల్లలు ఈ జనరేషన్ అబ్బాయిలకు కూడా నవ్వుతూ ఫన్నీగా చూస్తారు.
అంతలా తన నటనతో మెప్పించాడు వెంకటేష్ . కాగా ప్రజెంట్ వచ్చిన అవకాశాలలో నచ్చిన కథలను చూస్ చేసుకుంటూ నటిస్తున్న వెంకటేష్ కుర్ర బ్యూటీలకు మాత్రం తన సినిమా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్నాడట. దానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ అంటూ తెలుస్తుంది. కూతురు వయసు లాంటి అమ్మాయితో కూడా అక్రమ సంబంధం అంటగటి ట్రోల్ చేసేస్తున్నారని.. ఆ కారణంగానే తన సినిమాలో కుర్ర బ్యూటీలకు ఛాన్స్ ఇచ్చేదే లేదని వెంకటేష్ బలంగా ఫిక్స్ అయ్యారట .
మరీ ముఖ్యంగా ఆయన వయసు కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే వయసుతో సంబంధం లేకుండా అడ్డు అదుపు లేకుండా కుర్ర బ్యూటీలతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్న సీనియర్ హీరోలకి వెంకటేష్ భలే బుద్ధి చెప్పాడు అంటూ వెంకటేష్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం వెంకటేష్ కి కుర్ర డ్యూటీలకి సెట్ అవ్వదని.. వాళ్ళ హైట్ , వెయిట్ చాలా చిన్నగా, తక్కువుగా ఉంటుందని .. వెంకటేష్ ముందు వాళ్ళు చెల్లిలా.. కూతుర్ల తేలిపోతారని సినిమాకి పెద్ద ప్లస్ అవ్వని ఆ కారణంగానే వెంకటేష్ ఇలాంటి బోల్డ్ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే వెంకటేష్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే మంచిదే కదా అంటూ వెంకటేష్ ఫ్యాన్స్ ఆయన తీసుకుని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు..!!