Moviesమ‌నోజ్ - మౌనిక పెళ్లి మోహ‌న్‌బాబుకు నిజంగానే ఇష్టంలేదా.. ఆ ఒక్క...

మ‌నోజ్ – మౌనిక పెళ్లి మోహ‌న్‌బాబుకు నిజంగానే ఇష్టంలేదా.. ఆ ఒక్క మాట‌తో తేల్చేశారా…!

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లితో కొత్త వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఇటీవల ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభించారు. మంచు ఫ్యామిలీ సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది.

వాస్తవానికి అటు మనోజ్ కు.. ఇటు మౌనికకు అంతకుముందే వేరువేరు వ్యక్తులతో పెళ్లి జరిగి మనస్పర్ధల నేపథ్యంలో వారు తమ భాగస్వాములతో విడిపోయారు. ఇక ఈ పెళ్లి మనోజ్ తండ్రి మోహన్ బాబుకు ఇష్టం లేదని.. అసలు వివాహానికి కూడా ఆయన హాజరుకారంటూ ముందు నుంచి ఒక్కటే వార్తలు వినిపించాయి. మనోజ్ – మౌనిక పెళ్లి అంతా మనోజ్ అక్క మంచు లక్ష్మి ఆధ్వర్యంలోనే జరిగింది.

లక్ష్మీ ఇంట్లోనే ఈ పెళ్లి జరగటం.. పెళ్లిలో ఆమె అంతా తానై వ్యవహరించడం మోహన్ బాబు, విష్ణు హడావుడి కనిపించకపోవడంతో ఇది నిజం అని చాలామంది భావించారు. తాజాగా మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మోహన్ బాబు మనోజ్ రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనోజ్ నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు… తాను ఒకసారి ఆలోచించుకోమని సూచించాను.. మనోజ్ లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని భావిస్తున్నాను అనడంతో… ఇంకేముంది చేసుకో బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను అని మోహన్ బాబు చెప్పారు.

మనోజ్ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాక తను కాదని ఎందుకంటాను ? ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకుండా మన పని మనం చేసుకు పోవాలి అని మనోజ్ పెళ్లిపై వస్తున్న విమర్శలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు మోహన్ బాబు. ఏదేమైనా మోహన్ బాబు ఓసారి ఆలోచించుకోమని మనోజ్ కు చెప్పిన మాటను బట్టి చూస్తే ఈ పెళ్లి ఆయనకు పూర్తిగా ఇష్టం ఉందా లేదా ? అన్నదానిపై కాస్త డౌట్ అయితే ఉంది. వాస్తవానికి మంచు విష్ణు – వెరోనిక పెళ్లికూడా ఆయనకు ఇష్టం లేదు. అయితే ఇండస్ట్రీలో పెద్దలు మోహన్ బాబు పై ఒత్తిడి చేయడంతో ఆయన ఎట్టకేలకు అంగీకరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news