బాలీవుడ్.. అంటే హిందీ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మెగా హీరోయిన్ రేఖ. ఆమె ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఉండిపోయారు. అయితే.. హిందీ సినీ రంగంలో మెరుపులు మెరిపించిన రేఖ ఎక్కడివారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. ఆమె ఏపీకి చెందిన తెలుగు వ్యక్తి. అనూహ్యంగా ఆమెకు హిందీలో అవకాశాలు వచ్చాయి. నిజానికి ఆమెపుట్టింది చెన్నైలో అయినా.. తెలుగు మూలాలు ఉన్నాయి. రేఖ తల్లి పుష్పలత చిత్తూరు ఆడపడుచే.
అందుకే ఆమె తెలుగు అమ్మాయిగానే తనను తాను పరిచయం చేసుకునేవారు. అయితే.. రేఖ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరమే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రేఖ ప్రేమించుకుంటున్నారనీ, పెళ్లి చేసుకుంటారనీ కొంత కాలం, సంజయ్‌దత్ ఆమెను పెళ్లి చేసుకున్నాడని మరి కొంత కాలం, రాజ్‌బబ్బర్‌తో రేఖ ప్రేమలో ఉందని ఇంకొంత కాలం వార్తలు వినిపించాయి. అలాగే 1973లో నటుడు వినోద్ మెహ్రా, రేఖ పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే.. ఇప్పటికీ.. ఇది సస్పెన్సే. ఆమె తన వైవాహిక విషయాలను బహిర్గతం చేసిందే లేదు. బాలీవుడ్ నటుడు, నిర్మాత వినోద్ మెహ్రా .. రేఖ కలిసి నటించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. ‘ఘర్’, ‘ఔరత్ ఔరత్ ఔరత్’’ వంటి ఎన్నో చిత్రాల్లో వీరిద్దరూ కలసి నటించారు. వీరి అనుబందాన్ని గమనించిన కొందరు పెళ్లి చేసుకుంటారని అని ప్రచారం చేస్తే, రహస్యంగా పెళ్లి చేసుకున్నారని మరి కొందరు చెప్పేవారు.
ఆ రోజుల్లో ఈ పెళ్లి వార్త గురించి రేఖ కానీ, వినోద్ మెహ్రా కానీ పెదవి విప్పకుండా మౌనం వహించడంతో వాస్తవం ఏమిటన్నది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. అయితే చాలా కాలం తర్వాత అంటే 2004లో సిమీ గారేవాల్ టాక్ షోకు హాజరైన రేఖ తొలి సారిగా మౌనం విడనాడి, తమ పెళ్లి వార్త నిజం కాదని చెప్పారు.
‘వినోద్, రేఖ చాలా చిత్రాల్లో కలసి నటించారు. రేఖను వినోద్ ప్రేమించాడు. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ బ్యాడ్ లక్. అది జరగలేదు’ అని ఇప్పటికీ బాలీవుడ్ లో ఒక టాక్ ఉంది.
అదేసమయంలో రేఖ-అమితాబ్ విషయంలోనూ ఒక వార్త ఇప్పటికీ సజీవం. వీరిద్దరూ కూడా ప్రేమించుకున్నారని.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని.. కానీ, కుదరలేదని.. అందుకే అమితాబ్ కోసం.. రేఖ జీవితాంతం ఒంటరిగా ఉండిపోయారనే వార్తలు బాలీవుడ్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.