Moviesమనోజ్ అన్న ఆ ఒక్క మాటకి అందరి ముందే ఏడ్చేసిన మౌనిక.....

మనోజ్ అన్న ఆ ఒక్క మాటకి అందరి ముందే ఏడ్చేసిన మౌనిక.. మంచు వారి పిల్లోడు ఎక్కడో టచ్ చేసాడుగా..!!

ఈ మధ్యకాలంలో మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ పేరు సోషల్ మీడియాలో , పాలిటిక్స్ లో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న తర్వాత మంచు మనోజ్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది . అంతేకాదు త్వరలోనే మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని భూమా ఇంటి అల్లుడుగా త్వరలోనే రాజకీయాలలో పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే తనకు రాజకీయాలల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అంటూ ఇప్పటికే మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు.

కాగా రీసెంట్గా మోహన్ బాబు జన్మదిన వేడుకలు లో భాగంగా నిర్వహించిన ఓ ఫంక్షన్ లో మంచు మనోజ్ చాలా ఎమోషన్ అయ్యాడు . తిరుపతిలోని మోహన్ బాబు కు చెందిన శ్రీ విద్యానికేతన్ సంస్థలలో మోహన్ బాబు జన్మదిన వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు . ఈ కార్యక్రమంలోని మంచు మనోజ్ చాలా ఎమోషనల్ గా ప్రసంగించారు . ఈ క్రమంలోని మంచు మనోజ్ – భూమా మౌనిక జంటగా మోహన్ బాబు బర్త డే సెలబ్రేషన్స్ కు హాజరవ్వడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . నాన్న పుట్టిన రోజు సందర్భంగా మంచు మనోజ్ స్టేజిపై ప్రసంగిస్తూ ..తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు .

అంతేకాదు చివరిలో తన తండ్రిని భార్య గురించి మాట్లాడి చాలా ఎమోషనల్ అయ్యాడు . మంచు మనోజ్ మాట్లాడుతూ..” నేను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. తన డ్రీమ్స్ కి నేను ఎప్పుడు అడ్డు చెప్పను ..తన డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేసుకునే విధంగా నేను హెల్ప్ చేస్తాను ..తాను ఏం చేయాలనుకున్న నేను కచ్చితంగా సపోర్ట్ ఇస్తాను . అందరూ అంటుంటారుగా ప్రతి మగాడి గెలుపు వెనకాల ఆడవారు ఉంటారు అని ..ఆడవారి విజయం వెనక కూడా మగాళ్లు ఉండాలని నేను భావిస్తున్నాను . అదే నేను ఫాలో అవుతాను ” అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు .

ఈ క్రమంలోనే మనోజ్ మాటలు విన్న భూమా మౌనిక అందరి ముందే సంతోషంతో కంటి తడి పెట్టుకున్నారు . దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . అంతేకాదు ” నేను ఇప్పటికే మా నాన్నని ఎంతో ఇబ్బంది పెట్టానని.. ఆయన ఆయన నాకు అన్ కండిషనల్ లవ్ ఇచ్చారని.. ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను “అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు . ఈ క్రమంలోనే అక్కడ ఉండే జనాలు చప్పట్లతో మంచు మనోజ్ రియల్ హీరో అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. మంచు మనోజ్ మాటలు చూస్తుంటే త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి చెడు గుడు ఆడేసుకుంటాడు అంటూ కొందరు ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news