టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ..ప్రెసెంట్ ఏ రేంజ్ లో సోషల్ మీడియాని ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అంతేనా తనకు అదృష్టాని తెచ్చి పెట్టిన నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఎంతలా అంటే వీళ్ళ పెళ్లి అప్పుడు నడిచిన హంగామా అంతా అంతా కాదు .
ఏది చేసినా అప్పట్లో సంచలనంగానే మారింది. ఓ డాన్స్ చేసిన ..వారు షాపింగ్ కి వెళ్ళినా..వామ్మో ఆ రచ్చ నోటి తో చెప్పితే అర్ధమైయేది కాదు..కళ్లతో చూడాల్సిందే. సీన్ కట్ చేస్తే పట్టుమంటూ పది కాలాలపాటు కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు ఈ జంట . అప్పుడే ప్రేమ కర్గిపోయిందో ..మోజు తీరిపోయిందో వాళ్లకే తెలియాలి. కానీ ఇక లైఫ్ లో కలిసేది లేదు అంటూ ఇద్దరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు .
అయితే రీసెంట్గా బాలీవుడ్ క్రిటిక్ గా పేరు సంపాదించుకున్న ఉమర్ సైంధు .. సమంతకి సంబంధించిన ప్రైవేట్ విషయాన్నీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. సమంత నాగచైతన్యత విడాకులు తీసుకుంది ఇందుకే అంటూ ఘాటుగా బోల్డ్ గా స్పందించాడు . “అక్కినేని ఫ్యామిలీ పాటించే చెత్త సాంప్రదాయాలను సమంతపై రుద్దడం ..దానికి కారణం అంటూ ఓపెన్ గా చెప్పేసాడు .
మరి ముఖ్యంగా సమంత సినిమాల విషయంలో కండిషన్స్ పెట్టడం ..వాళ్ళతో మాట్లాడద్దు.. వీళ్ళతో మాట్లాడద్దు..అలాంటి క్యారెక్టర్స్ చేయొద్దు ..ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటూ సమంతను పదేపదే టార్చర్ చేయడంతో ఆమె విసుగెత్తిపోయి.. ఎదిరించి మాట్లాడిన కారణంగానే అక్కినేని ఫ్యామిలీ ..సమంత ను గెంటేసిందని ట్వీట్ చేశాడు . అంతేకాదు సమంత తన జీవితంలో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నాగ చైతన్య ను పెళ్లి చేసుకోవడమే అంటూ కూడా రాసుకొచ్చాడు. దీంతో మరోసారి ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది..!!