టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన కెరీర్లో ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలలోనే నటించి సూపర్ హిట్లు కొట్టారు. ఒకప్పుడు వెంకటేష్ కు మహిళా అభిమానుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కుటుంబ కథ చిత్రాలతో అమాయకపు క్యారెక్టర్లతో వెంకటేష్ మహిళలను బాగా కట్టిపడేసాడు. దీనికి తోడు ఇతర భాషలో హిట్ అయిన కుటుంబ కథా చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి ఎక్కువ హిట్లు కొట్టారు.
వెంకటేష్ వరుసగా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, కలిసుందాం రా, ప్రేమతో రా చంటి, అబ్బాయిగారు, సుందరకాండ, కొండపల్లి రాజా ఇలా వరుసగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి సూపర్ హిట్ లు కొట్టారు.
ఇక సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ – వెంకటేష్ కాంబినేషన్లో కూడా మంచి సినిమాలు వచ్చాయి. ధర్మచక్రం, ముద్దుల ప్రియుడు, చిన్నబ్బాయి లాంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కల్సి ఉంది. అనూహ్యంగా రమ్యకృష్ణ ప్లేస్ లోకి సౌందర్య రావడంతో రమ్యకృష్ణ – వెంకీకి జోడిగా సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ కోల్పోయింది. ఆ సినిమా ఏదో కాదు పవిత్ర బంధం.
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ట్. వెంకటేష్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాలో హీరోయిన్గా ముందు రమ్యకృష్ణను తీసుకుందాం అనుకున్నారట. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి అయితే ఈ పాత్రలో సౌందర్య అయితే బాగా సెట్ అవుతుందని నిర్మాతలు, సినిమాకు పని చేస్తున్న కొందరు చెప్పడంతో చివరకు సౌందర్యను ఎంపిక చేశారు.
సౌందర్య ఆ సినిమాకు నిజంగానే చాలా ప్లస్ అయింది. ఆ పాత్రలో ఆమెను చూసిన ప్రతి ఒక్క భార్య తనని తాను గుర్తు చేసుకుంది. అంటే అంత గొప్పగా ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి సౌందర్య నటించింది. సౌందర్య – వెంకటేష్ కాంబినేషన్లో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. సౌందర్య తన సినిమాలో ఉందంటే చాలు వెంకటేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారట. కొన్ని సినిమాలలో అయితే వెంకటేష్ స్వయంగా సౌందర్యను తన పక్కన రికమెండ్ చేసే వారిని కూడా అనేవారు.