టాలీవుడ్ లో రాజమౌళి ఏ ముహూర్తాన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడో కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు ఫ్లాప్ అన్న మాట లేకుండా వరుసగా సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నారు. రాజమౌళి గత నాలుగు సినిమాలు చూస్తే తెలుగు సినిమా స్థాయిని భారతదేశం ఎల్లలు దాటించేసి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. ఈగ, బాహుబలి 1, బాహుబలి 2, త్రిబుల్ ఆర్ ఈ నాలుగు సినిమాలు కూడా రాజమౌళి లోని గొప్ప విజన్ ఆవిష్కరింపజేశాయి. బాహుబలి 2 ఏకంగా 2000 కోట్ల వసూళ్లు రాబడితే.. ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమాకు ఏకంగా ప్రపంచమే గర్వించేలా ఆస్కార్ అవార్డు వచ్చింది.
ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు భారతదేశమే కాదు ఏకంగా ప్రపంచంలో టాప్ దర్శకులు సైతం రాజమౌళి వైపు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే మన సినిమాలు బడ్జెట్ చాలా తక్కువ. అంత తక్కువ బడ్జెట్ లోనూ అద్భుతమైన క్వాలిటీ సినిమాలు తీస్తూ ఆస్కార్ అవార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు. రాజమౌళికి నిజంగా భారతీయ సినిమా ప్రేమికులు అందరూ సలాం చేయాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి పేరు ఇండియాలో ఏ స్థాయిలో మారుమోగిపోతుందో చెప్పక్కర్లేదు.
ఈ క్రేజ్ తో ఇప్పుడు రాజమౌళి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం రాజమౌళి ఏకంగా రు. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అలాగే లాభాల్లో వాటా కూడా ఇచ్చేలా ఒప్పందాలు జరుగుతున్నాయట. అయితే ఎప్పుడో 20 సంవత్సరాలు క్రితమే తనకు సినిమా చేసి పెట్టాలని దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ రాజమౌళికి కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. అప్పట్లో అది చాలా ఎక్కువ. వడ్డీలతో కలుపుకుంటే 20 ఏళ్ల తర్వాత ఆ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది.
మరి రాజమౌళికి ఇచ్చే రెమ్యూనరేషన్ లో ఆ అడ్వాన్సును ఎలా ? కట్ చేస్తారు అన్నది మాత్రం బయటకు తెలియట్లేదు. ఇక ఈ సినిమాకు కేఎల్ నారాయణ భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. మహేష్ బాబు సైతం రెమ్యూనరేషన్ రు. 80 కోట్లకు తగ్గకుండా అడుగుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటేనే దాదాపు ఏడాదికి పైగా డేట్లు ఇచ్చేయాలి. అందుకే మహేష్ కూడా గట్టిగానే అడుగుతున్నాడట. అయితే మహేష్ కి కూడా గతంలో కే.ఎల్. నారాయణ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.
ఆ అడ్వాన్స్ ను కట్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలో రాజమౌళి మహేష్ రెమ్యనేషన్లే రు. 180 నుంచి 200 కోట్ల వరకు ఉంటున్నాయి. ఈ లెక్కన అసలు సినిమాకు ఎంత ? బడ్జెట్ అవుతుంది అన్నది చూస్తుంటే 1000 కోట్లకు తక్కువ కాదని భారతీయ సినిమా వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కేఎల్ నారాయణ సైతం ఈ సినిమాకు అయ్యే ఖర్చును చూసి భయం భయంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అయితే మరికొందరు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు కూడా తాము ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతామని అంటున్నట్టు తెలుస్తోంది.