నంది అవార్డులు ప్రభుత్వం ఏ ముహూర్తాన ప్రకటించిందో ఏమో కానీ దానిమీద జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. దీనిమీద ఇప్పటివరకు అందరూ స్పందిస్తూనే ఉన్నారు. రోజుకో ఇండ్రస్ట్రీకి సంబంధించిన వ్యక్తి దీని మీద ఎదో ఒక కాంట్రవర్సీ చేస్తూనే ఉన్నాడు.
తాజాగా మెంటల్ కృష్ణ అదేనండి పోసాని కృష్ణ మురళి కూడా నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. నంది అవార్డుల ఎంపిక ఇప్పుడు క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంది.
తాజాగా ఏపీలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించడం విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తాము నాన్-ఆంధ్రా రెసిడెంట్స్ అయితే లోకేశ్ ఎవరు అంటూ తనదైన స్టయిల్లో పోసాని మాట్లడాడు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడూ తిట్టలేదని, రాజకీయ నాయకులను మాత్రమే తిట్టారని పోసాని అన్నారు.
లోకేశ్‌కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే మమ్మల్ని తరిమికొట్టేవారని పోసాని తెలంగాణకు పన్నులు కడుతున్నంత మాత్రాన తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని నిలదీశారు.
నంది అవార్డులు నీ అబ్బ సొత్తా అంటూ లోకేష్‌ను ప్రశ్నించారు పోసాని కృష్ణమురళి. విమర్శలు చేస్తే స్థానికేతరులు అవుతారా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్ లోకల్ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా అంటూ ఎదురు ప్రశ్నించారు.
లోకేష్ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంపర్ సినిమాకు తనకు వచ్చిన అవార్డును తీసుకోననని ఆయన ప్రకటించారు. ఈ అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా.. అవార్డు తీసుకుంటే పోసాని ఫలానా సామాజికవర్గమైనందునే ఆయనకు అవార్డు వచ్చిందంటారు..అందుకే ఈ అవార్డును తీసుకోనని ప్రకటించారు.