Newsబాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇంట్లో తీవ్ర‌విషాదం…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఇంట్లో తీవ్ర‌విషాదం…!

బాలీవుడ్ సీనియర్ నటి.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఎంత తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆ ఇంటి సభ్యులంతా తీవ్ర బాధలో ఉన్నారు. మాధురి దీక్షిత్ తల్లి స్నేహలత (90) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాధురి దీక్షిత్ ఆమె భర్త శ్రీరామ్ నేనే సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. మేము ఎంతగానో ప్రేమించే మా అమ్మ.. ఈరోజు ఉదయం ఆమెకు ఇష్టమైన వారి మధ్య ఉన్నప్పుడు స్వర్గస్తులు అయ్యారు అని తెలిపారు.

మాధురి తల్లి మరణం పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు… అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జూన్ లోనే తల్లి పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేస్తూ మాధురి చాలా ఎమోషనల్ కు గురైంది. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ… ప్రతి అమ్మాయికి తన తల్లే మంచి స్నేహితురాలు అంటారు.

నువ్వు నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు… నాకు ఎన్నో పాఠాలు నేర్పావు. అవే నాకు ఇప్పుడు పెద్ద బహుమతులు. నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్య… ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా అని రాసుకొచ్చింది. ఇక 1980 – 90వ దశకంలో మాధురి దీక్షిత్ బాలీవుడ్ ను ఏలేసింది.

ఆమె ఆ రోజుల్లోనే రెండు నుంచి… మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్. బాలీవుడ్‌లో స్టార్ హీరోలు అందరూ మాధురితో ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కనేవారు. ఇక అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీరామ్‌ని పెళ్లి చేసుకున్న మాధురి ఆ తర్వాత చాలా రోజులపాటు అమెరికాలోనే ఉండిపోయింది. కొన్నేళ్ల క్రితం ఇండియాకు తిరిగివచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news