మహానటి సావిత్రి- అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన అనేక సినిమాలు విజయవంతం అయ్యాయి. అయితే.. తొలి నాళ్లలో వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం దేవదాస్. ఈ సినిమా విషయంలో అనేక గందరగోళాలు ఉన్నాయి. తాగుబోతు పాత్రకు అక్కినేనిని ఎంచుకోవడంలోనే వేదాంతం రాఘవయ్య (ఈ సినిమా దర్శకులు)తప్పు చేశారంటూ..పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రచారం జరిగింది. ఇక, ఈయన పక్కన సావిత్రి ఏంటి? అని కూడా అనుకున్నారు.
వాస్తవానికి దేవదాస్ కోసం.. భానుమతిని ముందుగా నిర్ణయించుకున్నారు. దీంతో సావిత్రి పేరు ముందుగా ప్రచారంలోకి రాలేదు. అయితే.. కారణాంతరాల వల్ల భానుమతి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నా రు. అదే సమయంలో ఆమె వేరే షూటింగుల్లో బిజీగా ఉండడంతో పైగా.. సినిమాలో టైటిల్ రోల్ చుట్టూ కథ తిరగడం ఆమెకు నచ్చలేదు. దీంతో సావిత్రిని తీసుకున్నారట. అయితే.. సావిత్రి విషయం బయటకు చెప్పకుండా.. ఎందుకంటే అప్పటికే భానుమతి ప్రచారం జరిగినందున సగం షూటింగ్ పూర్తయిపోయింది.
తర్వాత.. మధ్యలో ఎక్కడో సావిత్రి పేరు చెప్పారు. మొత్తంగా.. ఈ సినిమా ఆది నుంచి కూడా అనేక సందేహాలు సమస్యలతోనే ముందుకు సాగింది. ఇక, సినిమా విడుదలయ్యాక తొలి రెండు వారాలు కలెక్షన్స్ లేవంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే.. తర్వాత తర్వాత పుంజుకుని విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తెనాలి వంటి చోట్ల ఏడాదిన్నర పైగానే ఈ సినిమా ఆడింది.
అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. సినిమాలో నటించిన నాగేశ్వరరావు, సావిత్రలకు తర్వాత అవకాశాలు రాలేదు. ఏడాది పాటు నాగేశ్వరరావు,దాదాపు ఏడాదిన్నర పాటు సావిత్రి ఖాళీగా ఉన్నారు. కారణాలు తెలియదని గుమ్మడి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో రాసుకున్నారు. అయితే.. తర్వాత వచ్చిన ఆఫర్లు మాత్రం మంచివి వచ్చాయని చెప్పారు. ఇదీ.. సంగతి..!