టాలీవుడ్ లో 1995 – 2000 సంవత్సరాల్లో చాలామంది హీరోయిన్లు వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. ఈ లిస్టులోనే లైలా కూడా ఒకరు. అసలు లైలా పేరు చెబితే అదిరిపోయే అందం, చెరగని ఆమె చిరునవ్వే గుర్తుకు వస్తూ ఉంటుంది. లైలా అందం మామూలుగా ఉండదు. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పదేళ్లపాటు ఆమె నటించింది. ఇంత లాంగ్ కెరీర్ కొనసాగించినా ఆమెకు చెప్పుకోదగ్గ పాత్ర ఒకటి లేకపోవడంతో ఆమె త్వరగా తెరమరుగు అయిపోయింది.
లైలా తెలుగుతో పోలిస్తే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో పక్కన నటించిన కూడా ఆమెకు దశ తిరగలేదు. నువ్వే కావాలి ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా ఆమె నటించింది. గత 15 ఏళ్లుగా అసలు లైలా ఎక్కడ ? ఉందో ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని తహతహలాడిపోతుంది. ఆమె వయసు హీరోయిన్లు అందరూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు.
దీంతో లైలాకు ఇప్పటికీ తిరిగి వెండితెరపై కనిపించాలన్న ఆత్రుత కనిపిస్తోంది. ఆమె వయసు 42 సంవత్సరాలు. గోవాలో పుట్టిన లైలా 1996లో దుష్మన్ దునియాకే అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి సంవత్సరం తెలుగులో వచ్చిన ఎగిరే పావురమా సినిమాలో హీరోయిన్గా నటించింది లయ. ఆ సినిమా సూపర్ హిట్. చివరగా 2006లో మహాసముద్రం అనే మలయాళ సినిమాలో కనిపించింది.ఆ తర్వాత ఆమె ఏమైపోయిందో ఎక్కడ ఉందో చాలా రోజులపాటు ఎవరికి తెలియలేదు.
లైలా జన్మతః క్రిస్టియన్.. అయితే ఆమె ఒక ఇరానీ వ్యాపారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు ఎనిమిది సంవత్సరాలపాటు ఆ వ్యాపారితో ఆమె డేటింగ్ చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత నాలుగేళ్లపాటు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టారు. 15 ఏళ్ల పాటు ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో తిరిగి రాణించాలని కోరుతూ ఉంది.
తమిళంలో ఆమె ముందుగా బుల్లితెరపై అక్కడక్కడ కనిపించడం మొదలుపెట్టింది. తెలుగులో కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి వాళ్లకు జడ్జిగా చేస్తుంది. అలా ఏకంగా కార్తీ నటించిన సర్దార్ సినిమాలో ఒక మంచి రోల్ లో కనిపించింది. ఇప్పుడు శబ్దం అనే సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులోను మంచి అవకాశాలు వస్తే నటించాలన్న కుతూహలంతో ఉంది.