Gossipsబాలయ్య కోసం కన్నీరు పెట్టుకున్నా ఉదయ భాను..

బాలయ్య కోసం కన్నీరు పెట్టుకున్నా ఉదయ భాను..

బాలయ్య గురించి ఉదయభాను ఏమందో తెలుసా..?

బాలయ్య అలా చేశాడా ..? ఉదయభాను చెప్తున్న నిజం ఇదే ..!

యాంకర్ ఉదయ భాను అనగానే మనకి గుర్తొచ్చే అందమయిన పొడవాటి చక్కని తెలుగు ఇంటి అమ్మాయి. మొదట్లో బుల్లితెర మీద తన హవా చూపించిన ఈ భామ ఆ తరువాత మెల్లిమెల్లిగా బుల్లితెరకు దూరం అవుతూ వచ్చింది. మళ్ళీ తన కెరియర్ ను స్టార్ట్ చేసింది. అయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం ఈమె ఒక ప్రముఖ ఛానల్ నిర్వహిస్తున్న ‘నీతోనే’ డాన్స్ షోను యాంకర్ గా నిర్వహిస్తోంది. ఇదే కార్యక్రమానికి రేణు దేశాయ్ కూడ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈకార్యక్రమానికి సంబంధించిన లేటెస్ట్ షోలో ఉదయభాను బాలకృష్ణ మానవత్వానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తన కుటుంబ సభ్యులకు దూరం అయిన ఉదయభాను ఆ విషయాలను తలుచుకుని ఇదే కార్యక్రమంలో కంటనీరు పెట్టుకుంది.

తాను ప్రెగ్నెంట్ అయినప్పుడు పుట్టింటి వారు తన దగ్గర లేకపోవడంతో ఆ సమయంలో సీమంతం చేయించుకోవాలి అనే కోరిక తనకు నెరవేరని విషయాన్ని ప్రస్తావిస్తూ కనీసం తన సినిమా కుటుంబ సభ్యులమధ్య తన పిల్లల మొదటి బర్త్‌డే జరపాలని చేసిన ప్రయత్నాలను చెప్పుకొచ్చింది ఈ యాంకరమ్మ.

ఫంక్షన్ కు ఆహ్వానిస్తూ ఎందరికో ఫోన్లు చేసినా చాలామంది స్పందించలేదు అంట. ఇదే విషయమై నందమూరి బాలకృష్ణకు చిన్న మెసేజ్ పెడితే ఆయన స్పందించిన విషయాన్ని వివరించింది ఉదయభాను. తన మెసేజ్ చూసిన వెంటనే బాలకృష్ణ తనకు కాల్ బ్యాక్ చేసి తన పిల్లల బర్త్ డే ఫంక్షన్ కు వస్తానని చెప్పాడంట.

ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆరోజు అనంతపురంలో ఉన్నా తన కార్యక్రమాలు అన్నీ ముగించుకుని ఇచ్చిన మాట కోసం తన పిల్లల పుట్టినరోజు ఫంక్షన్ కు వచ్చిన విషయాన్ని బయట పెట్టింది ఉదయభాను. దాదాపు 45 నిముషాలపాటు తన పిల్లల ఫంక్షన్ లో అందరితో కలిసిమెలిసిపోతూ బాలయ్య తమ పై చూపించిన ప్రేమానురాగాలు తను జీవితంలో మరిచిపోలేను అంటూ కామెంట్స్ చేసింది. బాలయ్యకు ప్రేమ వచ్చినా, అభిమానం వచ్చినా ఎవ్వరూ తట్టుకోలేరు.

https://www.youtube.com/watch?v=_10UK2x-KXs

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news