గత మూడేళ్లుగా వార్తల్లో వ్యక్తులుగా మారిన సీనియర్ నటుడు నరేష్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు… తమ కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. నరేష్ – పవిత్ర మెడలో మూడు ముళ్ళు వేయగా.. ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేశారు. కొత్త సంవత్సరం కానుకగా తామిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు లిప్ కిస్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే ఈ పెళ్లి ఎక్కడ ? జరిగింది అనేది మాత్రం వీడియోలో రివీల్ చేయలేదు. పెళ్లి వీడియోను మాత్రం నరేష్ రిలీజ్ చేశారు. మొదటి పెళ్లిలో భార్యాభర్తలు ఇద్దరు ఎంత హ్యాపీగా ఉంటారో ? అంతకుమించి రెట్టించిన ఉత్సాహంతో నరేష్ – పవిత్ర ఈ పెళ్లిలో కనిపించారు. ఇప్పటికే నరేష్ పెళ్లి విషయంలో పెద్ద వివాదం నడుస్తోంది.
నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. తాను తన భర్తకు విడాకులు ఇవ్వనని… తన భర్తతోనే కలిసి ఉంటానని పదేపదే ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రమ్యకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రను ఎలా ? పెళ్లి చేసుకుంటాడు అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇప్పటికే నరేష్ – రమ్య మధ్య గత ఏడాదిన్నర కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
వీరి కేసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. ఇలాంటి టైంలో నరేష్ ఏ ధైర్యంతో ? పవిత్ర లోకేష్న్ పెళ్లి చేసుకున్నాడు అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మరి ఈ పెళ్లి వీడియోపై రమ్య ఎలా ?స్పందిస్తుంది ఏంటన్నది ఆసక్తిగా మారింది. అయితే మరో ట్విస్ట్ ఏంటంటే ఈ పెళ్లి వీడియో ఎంఎస్. రాజు నిర్మిస్తోన్న ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా షూట్ చేశారని.. ఇది అసలు పెళ్లి కాదని అంటున్నారు. మరి పూర్తి నిజాలు బయటకు వచ్చే వరకు ఈ సస్పెన్స్ తెరపడేలా లేదు.