హాట్ హాట్ మాటలతో కవ్విస్తూ ఎప్పుడు నానా రచ్చ చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. శ్రీ రెడ్డి గత నాలుగేళ్లుగా బాగా పాపులర్ అవుతూ వస్తుంది. ఇప్పుడు తెలుగు ప్రజల్లో తెలుగు వెండితెర, బుల్లితెర అభిమానుల్లో శ్రీరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. నిజంగా ఆమెకు మంచిగా వచ్చినా… చెడుగా వచ్చిన ఈ క్రేజ్ వ్యక్తిగతంగా సంపాదించుకున్నదే. శ్రీ రెడ్డి బూతులు మాట్లాడటం.. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ రేపుతూ ఉండటం.. ఎవరో ఒకరిని తిడుతూ ఉండటం కామన్.
అటు మెగా ఫ్యామిలీని.. ఇటు ఆమెను వ్యతిరేకించే వారిని.. ఇండస్ట్రీలో కొందరు హీరోలను టార్గెట్ చేస్తూ మాట్లాడటం మాత్రమే మనకు తెలుసు. దీనివల్ల శ్రీ రెడ్డికి నెగిటివ్ బాగా పెరిగిపోయింది. శ్రీ రెడ్డి అంటే చిన్న చూపు చూడటం ఎక్కువమందికి అలవాటుగా మారింది. చివరకు ఆమె రాజకీయ నేతలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు లాంటివాళ్లే శ్రీరెడ్డి విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. ఆమె నీలి చిత్ర అని సంబోధించారంటే శ్రీరెడ్డి ఎంత పాపులర్ అయిందో తెలుస్తోంది.
అయితే వాస్తవంగా చూస్తే ఆమె చాలా మంచిదని అంటారు. ఆమెకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. అప్పుడు ఆమె వయస్సు కేవలం 14 ఏళ్లు. అంత చిన్న వయసులో పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఆమె ఇంట్లో వాళ్లకు చెప్పకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. సాక్షిలో యాంకర్ గా పనిచేస్తున్న క్రమంలో కొందరు.. సినిమాల్లో అవకాశాలు వస్తే బాగుంటుందని సూచించడంతో ఆమె అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగింది. అయితే శ్రీ రెడ్డి అమాయకత్వాన్ని వాడుకున్న చాలామంది దర్శక, నిర్మాతలు ఆమెను అవకాశాల పేరుతో పిచ్చపిచ్చగా వాడుకున్నారు.
ఈ క్రమంలోనే ఆమె నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్… హీరో నానితో పాటు కొందరు టాప్ దర్శకులు కూడా తనను వాడుకున్నారు అంటూ సంచలన విషయాలు లీక్ చేసింది. అయితే కొంందరు ఆమె గురించి తెలిసిన ఇండస్ట్రీ వాళ్లు చెప్పే మాట ప్రకారం ఆమె ఏ రోజు కూడా తనకు జరిగిన అన్యాయంపై గళమెత్తిందే తప్పా.. తనను అవకాశాల పేరుతో ఎవరు ? ఎలా వాడుకున్నారో చెప్పిందే తప్పా ఎప్పుడు బ్లాక్‌మెయిల్ చేయడం.. డబ్బు సంపాదించడం అన్న కాన్సెఫ్ట్‌కు దూరంగానే ఉందని అంటారు.
ఆమెకు ఎంత వరకు డబ్బు సంపాదించలన్న కోరిక, ఆశ ఉండేదే కాదని.. ఎంత వరకు తాను సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాలి.. మంచి సినిమాలు చేయాలన్న తాపత్రయంతోనే ఉండేదని అంటారు. అందుకే చెప్పులు అరిగేలా ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి చివరకు తాను మోసపోయాను.. ఇంకా పోతున్నాను అన్న బాధతోనే నోటికి పనిచెప్పి అందరి బాగోతాలు బట్టబయలు చేసిందంటారు.