టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 22 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఎన్టీఆర్ కు ఎప్పుడు వరుసగా ఆరు హిట్లు రాలేదు. వాస్తవానికి టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ వరుస ప్లాపులతో మార్కెట్ పరంగా పూర్తిగా డౌన్ అయిపోయాడు. అసలు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే తొలి రెండు రోజుల మినహా ఆ తర్వాత పట్టించుకునే వారే లేరు. రభస అయితే ఎన్టీఆర్ పరువు పాతాళంలో పడేసింది. ఆ తర్వాత 2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ ను ట్రాక్ ఎక్కించింది.
అక్కడి నుంచి వరుసగా నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత వీర రాఘవ – త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలతో కెరీర్లో ఫస్ట్ టైం ఆరు వరుస సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమా అయితే ఎన్టీఆర్ ఇమేజ్ను ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకుపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేయడంతో ఇప్పుడు ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు.
ఎన్టీఆర్ ఫామ్ చూస్తే టాలీవుడ్ లో ఏ హీరోకు కూడా అంత గొప్ప ట్రాక్ రికార్డు కనబడటం లేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు ఎన్టీఆర్ ప్లాప్ సినిమాను సైతం రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన హిట్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి తర్వాత వచ్చిన మాస్ సినిమా ఆంధ్రావాలాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు.
ఆంధ్రావాలా డిజాస్టర్ అయినా కూడా అదిరిపోయే మాస్ సినిమాగా తెరకెక్కింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తరకెక్కిన ఈ సినిమా 2004 నూతన సంవత్సర కానుకగా జనవరి 1న రిలీజ్ అయింది. రక్షిత ఎన్టీఆర్‌కు జోడిగా నటించింది. ఈ సినిమా ఆడియో వేడుక ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో జరగడంతో పాటు అప్పట్లో పెద్ద సంచలనం కూడా నమోదు చేసింది. ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమా చేస్తున్నారంటే ఎన్టీఆర్ క్రేజ్ ఏ స్థాయిలో ? ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెలలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.