టాలీవుడ్ లో గత 15 ఏళ్లలో తెలుగు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మాధవీలత – ఈశా రెబ్బా – అంజలి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే హిట్ సినిమాలలో నటించారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన నచ్చావులే సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది మాధవీలత. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆమెకు మంచి అవకాశాలే వచ్చాయి. ఈ సినిమాలో నటించడానికి ముందు ఆమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది.
మాధవీ లత కర్ణాటకలోని బళ్ళారిలో 1988, అక్టోబరు 2న జన్మించింది. ఆమె పుట్టింది కర్నాకట అయినా తెలుగు మూలాలు ఉన్న అమ్మాయే. ఆమె పూర్వీకులు విజయవాడ ప్రాంతానికి చెందినవారు. మాధవి
బళ్ళారిలోనే ఎ.ఎస్.ఎం మహిళా కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ పూర్తి చేసి తర్వాత గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ చేసింది.
అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో మాత్రం ఆమెకు అవకాశాలు దక్కలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కూడా మాధవీలత కనిపించింది. చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయిన మాధవీలత కాంట్రవర్సీ వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. బిజెపిలో చేరి పొలిటికల్ కూడా ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నప్పుడు.. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలని అని తన బాధను వెల్లగెక్కింది.
అయితే కెరీర్ ప్రారంభంలో మాధవీలతను టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ బాగా హెరాస్ చేశాడట. ఆ డైరెక్టర్ అడిగిన ఆ పనికి ఒప్పుకోకపోవడంతో… ఒక్క సీన్ కోసం మాధవీలతను పదేపదే ఇబ్బంది పెడుతూ ఆ సీన్ సరిగా రాలేదు.. నీ ఎక్స్ప్రెషన్స్ బాగోలేదు.. ఇదేం యాక్టింగ్ అంటూ సెట్లోనే అందరి ముందు రకరకాలుగా మాటలు అంటూ నరకం చూపించాడని ఆమె వాపోయింది. అయితే ఆ డైరెక్టర్ ఎవరన్నది ? ఆమె చెప్పకపోయినా పరోక్షంగా అయితే ఆమె హింట్ ఇవ్వడంతో ఆ డైరెక్టర్ గురించి అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.