1960 – 70వ దశలో ప్రముఖ హీరోయిన్లలో గీతాంజలి ఒకరు. గీతాంజలి అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో 1947లో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచే నాట్యం అంటే ఇష్టం. నాట్యం పట్ల ఆమెకు ఉన్న మక్కువతోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గీతాంజలి అప్పట్లో ఆరడుగుల అందగాడు అయిన రామకృష్ణను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి కాకముందు వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలలో నటించారు.
ఆ సమయంలో ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే రామకృష్ణకు తన సొంత మేనకోడలితో పెళ్లయింది. పెళ్లి జరిగిన తర్వాత రామకృష్ణ సినిమాల్లోకి రావడం.. స్టార్ హీరోగా సక్సెస్ కావడంతో భార్యకు దూరం అయిపోయాడు. ఆ తర్వాత గీతాంజలితో కలిసి నటిస్తున్న సమయంలో ఆమెతో ప్రేమ చిగురించి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది.
అయితే జెమినీ వాళ్ల సినిమా మంచిరోజులు వచ్చాయిలో కృష్ణంరాజు, గీతాంజలి జంటగా నటించారు. ఆ సినిమాలో గీతాంజలిని కృష్ణంరాజు రేప్ చేసి సీన్ ఒకటి ఉంది. సీన్లో భాగంగా గీతాంజలికి ఐస్ క్రీం ఇచ్చారట. ఆమె ఆ నురగను ఉమ్మి కృష్ణంరాజుపై వేస్తుంది. దీంతో కృష్ణంరాజు నామీదే ఉమ్మి వేస్తావా ? నీకు ఎంత ధైర్యం అంటూ ఆమెను రేప్ ఎటెంప్ట్ చేయడంతో పాటు ఆమెపైకి కుక్కను వదులుతాడు.
వెంటనే కుక్క గీతాంజలి చీర కొంగు పట్టుకుని లాగుతుంటే.. ఆమె వేడుకుంటూ ఉంటుంది. అలా కృష్ణంరాజు ఆ సీన్‌లో తనకు నరకం చూపించాడంటూ గీతాంజలి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ సినిమాలో గీతాంజలి నాగేశ్వరరావు చెల్లి పాత్రలో నటించింది. ఇక లేతమనసులు సినిమాలో హరనాథ్ కూడా ఓ సాంగ్‌లో చాలా ఇబ్బంది పెట్టారని తెలిపింది.
అయితే ఆయన తప్పు లేదని.. ఆయన అరడుగుల అజానుబాహుడు అని.. పాటలో ఆయన పక్కన చిన్న పిల్లగా ఉన్న తాను నటించేందుకు కష్టపడాల్సి వచ్చిందని.. ఆయన నన్ను పట్టుకుంటే విడిపించుకోవడమే కష్టంగా ఉండేదని చెప్పింది. ఇక ఓ సినిమాలో తన భర్త రామకృష్ణకే కిస్ ఇవ్వాలని డైరెక్టర్ అడిగితే… ముందు తాను ఒప్పుకోలేదని… తర్వాత సెట్లో నుంచి అందరిన బయటకు పంపేశాక ఆ సీన్ చేశానని ఆమె చెప్పారు.