టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు మిస్ ఇండియా. మహారాష్ట్రలో జన్మించిన నమ్రత మోడలింగ్ పై ఆసక్తితో ముంబైలో అడుగు పెట్టింది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియాగా కిరీటం గెలుచుకుంది. బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన నమ్రత చేసింది తక్కువ సినిమాలే అయినా మహేష్ మంజ్రేకర్ – సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన వంశీ సినిమాలో నటించింది.
ఈ క్రమంలోనే మహేష్ తో ఆమె ప్రేమలో పడిపోయింది. వంశీ సినిమా సరిగా ఆడకపోయినా నమ్రత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అంజి సినిమాలోనూ నటించింది. అంజి సినిమా కూడా భారీ బడ్జెట్ కావడంతో ప్లాప్ అయ్యింది. ఇక నమ్రత అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్ ప్రముఖ మరాఠీ నటి కావడం విశేషం. అలా నమ్రతకు సినిమా నేపథ్యం ఉంది. 1993లో ఆమె మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది.
నమ్రత హీరోయిన్గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే మహేష్ బాబును పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత ఆమె సినిమా కెరియర్ కు గుడ్ బై చెప్పడంతో చాలామంది అభిమానులు హర్ట్ అయ్యారు. ఆమె తప్పు చేసిందని.. కేవలం మహేష్ బాబు బలవంతం చేయడం వల్లే ఆమె సినిమాలు మానేసిందని అప్పట్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావాలనేది నా సొంత నిర్ణయం అని.. ఈ విషయంలో మహేష్ కానీ ఇతరుల సలహా, సూచనలు.. తన భర్త వార్నింగ్ ఏదీ లేదని మహేష్ కు క్లీన్‌చిట్ ఇచ్చేసింది. అలాగే మళ్ళీ తనకు పెళ్లి చేసుకునే అవకాశం వచ్చినా కూడా మహేష్ బాబునే చేసుకుంటానని నమ్రత చెప్పటం విశేషం. ఈ జంటకు గౌతమ్ – సితార అనే పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం మహేష్ – నమ్రత చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.