సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో .. ఎవరికీ తెలియదు. అప్పటివరకు స్టార్ గా ఉన్న హీరో జీరో అవడం.. జీరో గా ఉన్న హీరో స్టార్ అవ్వడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటుంది . ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది అందాల ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో జరిగే మాయలకు బలైపోయి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయారు. కాకపోతే రీసెంట్గా అలాంటి పోసిషన్ ని ఎదుర్కోబోతోంది టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే అంటూ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
మనకు తెలిసిందే అప్పుడెప్పుడో ముకుంద సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే .. ఇప్పటివరకు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే ఉంది . అయితే కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసిన పూజ హెగ్డే హిట్ కొట్టింది మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి . కాగా ప్రజెంట్ పూజా హెగ్డే ఆశలన్నీ త్వరలో రిలీజ్ కాబోతున్న సల్మాన్ ఖాన్ సినిమా పైన పెట్టుకొని ఉంది. ఇలాంటి క్రమంలోనే పూజ తెలుగులోనే రెండు బడా ప్రాజెక్టు లు చేతికి వచ్చినట్లు వచ్చి చేజారిపోయినట్లు తెలుస్తుంది.
ఇలాంటి క్రమంలోనే పూజా హెగ్డే రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవడానికి సిద్ధపడిందట . సగానికి పైగానే పారితోషకాని తగ్గించిన టాలీవుడ్ డైరెక్టర్ పూజా హెగ్డే పై ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో పూజ కెరియర్ క్లోజ్ అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆఖరికి సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించడానికి కూడా పూజ హెగ్డే సిద్ధపడింది అంటే ఆమె ఎంత దీనస్థితిలో ఉందా ..? అంటూ సినీ జనాలు ఆశ్చర్యపోతున్నారు . దీంతో పూజా హెగ్డే టైం బాగోలేదని.. ఆ కారణంగానే ఇలా వరుస ప్లాప్స్ పడుతున్నాయి అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!