తెలుగు సినిమా ఖ్యాతిని దేశం ఎల్లలు దాటించేసి ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన ఘనత కచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. మగధీర – ఈగ – బాహుబలి 1 – బాహుబలి 2, త్రిబుల్ ఆర్ సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకువెళ్లిన రాజమౌళి అంటే ఇప్పుడు దేశం మొత్తం గర్విస్తోంది అంటే రాజమౌళి టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బాలీవుడ్ సినిమా మాత్రమే కాదు… ఇండియన్ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూస్తోందంటే అందుకు రాజమౌళి సినిమాల తోనే సాధ్యం అయిందని చెప్పాలి.
హాలీవుడ్ టాప్ దర్శకులు జేమ్స్ కెమరూన్, స్పీల్ బర్గ్ లాంటి దిగ్గజాలు కూడా రాజమౌళి ప్రతిభకు సలాం కొట్టారంటే అంతకుమించిన గర్వకారణం తెలుగోడికి ఏం కావాలి. రాజమౌళి పేరే తెలుగు సినిమాకి ఒక పర్యాయపదంగా మిగిలిపోయింది అని చెప్పాలి. రాజమౌళి డైరెక్టర్గా కాకుండా.. ఒకవేళ హీరోగా వెళ్లి ఉంటే మన తెలుగు సినిమాకి ఇంతటి ఘనకీర్తి దక్కేదా ? అంటే కచ్చితంగా నో అని ఆన్సర్ వస్తుంది.
ఎందుకంటే రాజమౌళి అద్భుతమైన ఆలోచనలు వెండితెర మీద ఆవిష్కృతం చేసే మరో డైరెక్టర్ మన తరంలో పుట్టి ఉండేవాడు కాదేమో..! రాజమౌళి సోదరుడు, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి గురించి మనకు తెలియని కొన్ని సీక్రెట్లు చెప్పాడు. రాజమౌళికి చిన్నప్పటిన ఉంచే ఉన్న టాలెంట్ చూసి వీడు ఖచ్చితంగా హీరో అవుతాడనే అనేవారు.
రాజమౌళిని తర్వాత హీరోను చేసే ప్రయత్నాలు కూడా జరిగాయట. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి స్టోరీ రైటర్ కాబట్టి… కొడుకును హీరోగా పెట్టి ఓ సినిమా తీసే ఆలోచన కూడా చేశారట. రాజమౌళిని హీరోగా చేసేందుకు విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ మంచి స్టోరీ రాసి.. దానికి డైరెక్టర్‌గా బి. గోపాల్‌ను పెడదామని అనుకున్నారట.
అయితే రాజమౌళి మాత్రం తాను హీరో అయ్యేందుకు ససేమీరా ఒప్పుకోలేదట. అలా రాజమౌళి రూట్ నటన నుంచి సీరియల్స్ డైరెక్టర్‌గా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచమే మెచ్చే డైరెక్టర్‌గా మారింది.