Moviesఎక్కడికి వెళ్ళినా అదే మాట.. పదే పదే ఎందుకు రా నాకు...

ఎక్కడికి వెళ్ళినా అదే మాట.. పదే పదే ఎందుకు రా నాకు ఈ నస..? కోపం తో ఊగిపోయిన కాజల్ ..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి తరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటించి ఏకంగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా కొన్నాళ్లపాటు రాజ్యమేలేసింది . మరీ ముఖ్యంగా అప్పట్లో కాజల్ నటించిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో,, అదృష్ట దేవతగా భావించుకున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ కూడా కాజల్ అగర్వాల్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు .

కాగా కెరీర్ పీక్స్ లో ఉండగానే కాజల్ అగర్వాల్ తన బెస్ట్ ఫ్రెండ్ అయినా గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతేనా ఎంత త్వరగా పెళ్లి చేసుకున్న ఆమె అంత త్వరగా నే ఓ బిడ్డకు జన్మనిచ్చేసింది. ఈ క్రమంలోనే అందరూ కాజల్ కెరియర్ క్లోజ్ అనుకున్నారు . అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా బిడ్డ పుట్టిన మూడు నెలలకే తన బాడీ ఫిజిక్ ను మార్చేసుకుని కుర్ర బ్యూటీలకు కాంపిటీషన్ ఇచ్చే విధంగా రెడీ చేసుకుంది . ఈ క్రమంలోనే పలువురు జనాలు కాజల్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేశారు . బిడ్డ పుట్టిన మూడు నెలలకే సినిమాలపై మోజు ఏంటి కాజల్ ..? అంటూ దారుణంగా కామెంట్స్ చేశారు .

కాగా రీసెంట్గా నటించిన “ఘోస్టీ” సినిమా ప్రమోషన్స్ లో ఇలాంటి కామెంట్స్ పై మండిపడింది కాజల్ అగర్వాల్ . తాజాగా ఆమె నటిస్తున్న సినిమా “ఘోస్టీ”..హర్రర్ కామెడీ. ఈ సినిమా మార్చి 17న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై వచ్చిన వల్గర్ కామెంట్స్ ని తిప్పుకొట్టింది.

“ఎక్కడికి వెళ్ళినా.. ప్రతి ఒక్కరు అదే ప్రశ్న ..బిడ్డ పుట్టిన వెంటనే సినిమాలు అవసరమా..? అవసరమా..?? అంటూ అడుగుతున్నారు. కొందరైతే నానా రకాలుగా హింసిస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలు చేయకూడదా..? బిడ్డను మేనేజ్ చేసుకుంటూనే నేను సినిమాలు చేస్తున్నాను. నా బిడ్డ పైన నాకు ప్రేమ ఉంది . ఓ తల్లిగా నా బిడ్డ బాగోగలు నేనే చూసుకోగలను . నా కొడుకు విషయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా.. నేను కెమెరా ముందు నటించగలరు. నా బిడ్డని నేను చక్కగా చూసుకోగలను దయచేసి ఇలాంటి విషయాలపై చర్చించుకోవడం ఆపేయండి . నా బిడ్డ ని ఎలా చూసుకోవాలి నాకు తెలుసు అంటూ ఘాటుగా స్పందించింది . ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news