లయ అచ్చ తెలుగు అమ్మాయి. ఒకప్పుడు టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల హవా ఎక్కువగా ఉండేది. మహానటి సావిత్రి – జయప్రద – జయసుధ – విజయశాంతి వీరంతా స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలగడంతో పాటు తమిళంలోనూ.. హిందీలో కూడా రాణించారు. కాలక్రమేనా తెలుగు హీరోయిన్లు సినిమా రంగంలోకి రావడం తగ్గిపోతుంది. అలాంటి సమయంలో రెండున్నర దశాబ్దాల క్రిందట తెలుగు అమ్మాయిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన లయ మంచి సినిమాలు చేసింది.
లయ ఇండస్ట్రీని వదిలేసి చాలా ఏళ్ళు అవుతుంది. అయితే ఇప్పటికే అచ్చ తెలుగు హీరోయిన్గా ఆమె రూపం మన కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. విజయవాడకు చెందిన లయ అక్కడే నలంద కాలేజీలో చదువుకుంది. 1999లో కే విజయభాస్కర్ దర్శకత్వంలో తొట్టెంపూడి వేణు హీరోగా పరిచయం అయిన స్వయంవరం సినిమాలో తొలిసారి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వరుస పెట్టి ఐదేరేళ్లపాటు చక చక సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.
అందాల ప్రదర్శనకు దూరంగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను.. విమర్శకులను కూడా మెప్పించింది. ప్రేమించు సినిమాలో అంధురాలిగా నటించి.. నంది అవార్డు సైతం సొంతం చేసుకుంది. సినిమాలుకు గుడ్ బై చెప్పేసిన లయ అమెరికాకు చెందిన ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయింది. స్టార్ హీరోలలో ఒక్క బాలకృష్ణ పక్కన మాత్రమే ఆమె విజయేంద్ర వర్మ సినిమాలో నటించింది. ఇక లైయ పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించింది.
పవన్ కళ్యాణ్‌ను పెళ్లికి ఆహ్వానించేందుకు ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ గానే పవన్ ఇంటికి వెళ్లిందట. లయ వచ్చిన విషయం తెలుసుకున్న పవన్ ఆమెను నేరుగానే లోపలకు రమ్మని శుభలేఖ తీసుకుని.. తాను కచ్చితంగా పెళ్లికి వస్తానని మాట ఇచ్చారట. పవన్ చాలా బిజీగా ఉంటారు.. తన పెళ్లికి వస్తారా ? అన్న సందేహంతోనే లయ ఉండేదట. అయితే సడన్‌గా లయ పెళ్లి రిసెప్షన్‌కు వచ్చిన పవన్ ఆమెను ఆశీర్వదించడంతోపాటు.. అన్నయ్యకు కూడా చెప్పావు కదా ఆయన కూడా వస్తున్నారని చెప్పడంతో లయ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.
అయితే లయ పవన్ వచ్చిన ఆనందంతో ఏం మాట్లాడడో తెలియక సార్ భోంచేసి వెళ్ళండి అని.. పదేపదే చెబుతుందట. పవన్ భోజనం చేయాలా మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాను అని నవ్వుతూ మాట్లాడారట. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా అక్కడ భోజనం చేయడం కుదరదని… అంత టైం లేదని కానీ తాను ఆయనతో ఏం మాట్లాడాలో ? తెలియక అలా అనడంతో ఆయన నవ్వి మళ్ళీ వస్తాను అన్నారని.. ఆయన తన పెళ్లికి రావడం ఎప్పటికీ మర్చిపోలేనని లయ చెప్పుకు వచ్చింది.