సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు ఎవ్వరలే కాదు హీరోయిన్లు దర్శకుల యవ్వారాలు కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే హీరో పక్కన ఎలాంటి ? హీరోయిన్ అయితే బాగుంటుందో సెట్ చేయడంలో దర్శకుడు ముఖ్య పాత్ర. హీరోయిన్లకు వరుసగా ఛాన్సులు, అవకాశాలు ఇప్పించడంలో దర్శకుడు పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. అందుకే ఇటీవల కాలంలో హీరోయిన్లు.. హీరోల కంటే కూడా ఎక్కువగా దర్శకుల చేతిలో బొమ్మలుగా మారుతున్నారన్నది తెలిసిందే.
ఒక టాప్ డైరెక్టర్‌ను పట్టుకుంటే చాలు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వాటి అంతట అవే వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హీరోయిన్లు.. దర్శకులకు ఏం కావాలో అది ఇచ్చేసి తమకు కావలసిన సినిమా ఛాన్సులను సొంతం చేసుకుంటున్నారు అన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఇప్పుడు ఓ టాప్ డైరెక్టర్ ఓ హీరోయిన్… ఎఫైర్ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న ఆ డైరెక్టర్ ఓ హీరోయిన్ మోజులో పడ్డాడట.
ఈ దర్శకుడు తన ఎనిమిదేళ్ల కెరియర్లో ఐదారు సినిమాలు చేశాడు. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన హిట్ కొట్టాడు. అతని కెరీర్లో ఎక్కువ హిట్ సినిమాలు ఉన్నాయి. కాగా ఈ దర్శకుడు ఇప్పుడు ఫేడవుట్కు దగ్గరగా ఉన్న ఓ హీరోయిన్ ప్రేమలో మునిగి తేలుతున్నాడట. ఆమెతో కలిసి తరచూ నైట్ పార్టీలకు కూడా వెళుతున్నాడట. ఇప్పుడు హైదరాబాద్ పబ్బుల్లో వీరిద్దరూ తరచూ కనిపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ కూడా బాగా ముదిరిపోయిందని అంటున్నారు.
ఇండస్ట్రీకి సంబంధించిన పార్టీలకు కూడా వీరిద్దరూ కలిసే వెళుతున్నారట. ఇక ఆ హీరోయిన్ విషయానికి వస్తే ఆమె తెలుగులో సినిమా చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అందరికీ బాగా తెలిసిన ఫేసే. తన కెరీర్లో అనుకున్నంత సక్సెస్ లేదు. టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదగలేదు. ప్రస్తుతం ఆమె అవకాశాలు లేక ఫెడవుట్ దశలో ఉంది. విచిత్రం ఏంటంటే తాను ఎఫైర్ పెట్టుకున్న దర్శకుడితో ఆమె ఒక్క సినిమా కూడా చేయలేదు.
అలాంటిది వీరిద్దరికీ ఎలా ? జత కుదిరింది. ఏకంగా ఎఫైర్ ఇంత ఘాటుగా ఎలా ? నడుస్తోంది అన్నది ఇండస్ట్రీ వర్గాలకు ఎవరికి అంతు పట్టటం లేదు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.