ఆమని ఒకప్పుడు తెలుగులో ఫేమస్ హీరోయిన్. ఆమని అంటే ఈ తరంలో చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు. కాని శుభలగ్నం సినిమాలో డబ్బు కోసం ఆశపడి తన భర్తను రోజాకు అమ్ముకునే పాత్రలో ఆమె నటన మాత్రం ఎప్పటకీ మర్చిపోలేం. అసలు డబ్బు కోసం ఆశపడి భర్త జగపతిబాబును రోజాకు అమ్ముకునే విషయంలో ఆమె చేసిన నటన నభూతోః నభవిష్యత్. ఇప్పటకీ ఆమని అంటే ఆ పాత్రే గుర్తుకు వస్తుంది.
ఆమని తెలుగు మూలాలు ఉన్న అమ్మాయే. ఆమె పెరిగింది అంతా కన్నడలో అయినా.. ఆమె పుట్టిందా మాత్రం ఏపీలోని నెల్లూరులోనే. ఆమె తెలుగుతో పాటు తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమని గురువు ఈవీవీ సత్యనారాయణ. ఆయన దర్శకత్వం వహించిన జంబలడికిపండ సినిమాలో నరేష్‌కు జోడీగా హీరోయిన్గా నటించింది. ఈ సినమా సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌కు జోడీగా మిస్టర్ పెళ్లాం సినిమా చేసింది. ఆ సినిమాకు ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. అక్కడ నుంచి ఆమని వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఇక ఆమని ప్రేమ వివాహంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆమె పక్కా హిందు. ఆమెకు తిరుపతి వేంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం. ఆమె ప్రతి రోజు పూజలు చేయాల్సిందే అట.
అంత భక్తిఉన్న ఆమె ప్రముఖ తమిళ సినీ నిర్మాత ఖాజా మెహియుద్దీన్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి భాషలు, ఇద్దరి మతాలు వేరు. ఆమని పూర్తిగా సంప్రదాయాలు పాటించే అమ్మాయి. అలాంటి అమ్మాయి వేరే మతం వ్యక్తి ప్రేమలో పడడం అప్పట్లో ఓ సంచలనం. అయితే ఆమని చేసిన పూజలు చూసి…. ఆమె భర్త తాను కూడా మతం మారిపోవడం ఇక్కడ విచిత్రం.
తన కోసం తన భర్త ఇలా త్యాగం చేశాడని ఆమని చెపుతూ ఉంటుంది. అయితే ఆమని భర్త చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆమని 2003లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మధ్యాహ్నం హత్య సినిమాతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. భర్త కోసమే ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు బుల్లితెరపైకి కూడా వచ్చిందని అంటారు.