MoviesSamantha "నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత కూడా అలానే చేసింది".. ఇన్నాళ్లకు...

Samantha “నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత కూడా అలానే చేసింది”.. ఇన్నాళ్లకు అసలు నిజాలు బయట పెట్టిన చిన్మయి..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తున్న .. సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడే కాదు విడాకులు తీసుకున్న తర్వాత కూడా సమంత నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతుంది . రీసెంట్గా నటించిన యశోద సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టి సమంత పేరును మారుమ్రోగిపోయేలా చేసింది . అయితే సమంత పేరు ఇంతలా మారుమ్రోగిపోవడానికి కారణం.. సమంత నటన ఒక రీజన్ అయితే .. మరో రీజన్ సమంతకి వాయిస్ చెప్పే చిన్మయి.

డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫేమినిస్ట్ లా బిహేవ్ చేసే చిన్మయి.. అంటే కొందరు జనాలకి ఇష్టం.. కొందరికి కోపం మీటు వివాదానికి తెరలేపి ఇండస్ట్రీలో జరుగుతున్న అఘాయిత్యాలను బయటపెట్టిన సింగర్ చిన్మయి.. రీసెంట్ గా హీరోయిన్ సమంతపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి .

ఆమె మాట్లాడుతూ..” నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు అండగా సమంత నిలబడింది . నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించింది . మీటూ సమయంలో నేను పని కోల్పోయినప్పుడు సమంత నాకు హెల్ప్ చేసిన విధానం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమెతో పాటు కొంతమంది నాకు హెల్ప్ చేశారు .

కొంతమంది నన్ను తొక్కేయడానికి చూశారు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సమంత -చిన్మయి అంత మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు.. మరి ఎందుకు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది . దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news