అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా! వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్, నాకు తెలిసి ఇలా ఏ మాత్రం కనీసం 1% పక్షపాతం లేకుండా కేవలం ప్రతిభ (మెరిట్) మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ ఈ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు. ఇంత అద్భుతమైన నీతి నిజాయతీ గల “నంది అవార్డు కమిటీ” కి ఖచ్చితంగా “ఆస్కార్ అవార్డు ఇవ్వాలి” – “వావ్! నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ! ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్” అంటూ కమిటీ సభ్యులపై సటైర్లు వేశారు.
ఈ సెటైర్లు వేసింది ఎవరో కాదు సంచలనాలకు మారారు పేరు … వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నాను అంటూ అర్ధం పర్ధం లేకుండా మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. నంది అవార్డులు ప్రకరించినప్పటి నుంచి ఫిల్మ్ ఇండ్రస్ట్రీ కి సంబంధించిన వారు ఎవరో ఒకరు దీనిమీద స్పందిస్తూనే ఉన్నారు. అందరూ స్పందించడం వేరు.. వర్మ స్పందిస్తే ఆ కిక్కే వేరబ్బా !
వర్మ స్పందన అలా ఉంచితే … ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు ఫిల్మ్ ఇండ్రస్ట్రీ ఐక్యత కొంత వరకు దెబ్బతీసిందని చెప్పుకోవాలి . ఆఖరికి ఇది ఒక కుటుంబంలా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండ్రస్ట్రీ మధ్య కుల వివాదాలు కూడా సృష్టిస్తోంది. ఇది ఇంతటితో ఆగిపోతే పర్లేదు, లేకపోతే టాలీవుడ్ పరువు పోవడంతో పాటు ఏపీ పరువు కూడా గంగలో కలిసిపోవడం ఖాయం .