ఇప్పుడు నడుస్తోంది అంతా సోషల్ మీడియా యుగం. నెటిజన్లు ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఎవ్వరు ఏ చిన్న విషయంలో దొరికినా ట్రోలింగ్ చేస్తూ ఆటాడుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ – శ్రీలీల కాంబినేషన్‌పై ట్రోలింగ్ షురూ అవుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరి సినిమా ( తెలుగులో ఆల్రెడీ పోలీసోడుగా వచ్చసింది) రీమేక్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్లో ట్రోల్ నడుస్తోంది.
పవన్ వరుసగా రీమేక్‌లు చేస్తున్నారు. అసలు మా హీరోకు రీమేక్‌లు వద్దే వద్దని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ఇప్పుడు శ్రీలీల హీరోయిన్గా అనగానే వాళ్లే వద్దురా బాబోయ్ అంటున్నారు. అసలు పవన్ – శ్రీలీల జోడీ అన్న టాక్ బయటకు వచ్చినప్పటి నుంచే ట్రోలింగ్ అంతా పవన్ మీదకు తిరిగింది. తన వయస్సులో సగం కూడా లేని శ్రీలీల పక్కన పవన్ రొమాన్స్ చేయడం ఏంటని ? అంతా ట్రోల్ చేస్తున్నారు.
అయితే దీనిని కవర్ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ – శ్రీదేవి సీన్లో పోస్టులు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు బడిపంతులు సినిమాలో మవనరాలిగా చేసిన శ్రీదేవి ఆ తర్వాత ఆయనకు జోడీగా రొమాన్స్ చేయలేదా ? అంటున్నారు. అదే శ్రీదేవి ఓ సినిమాలో కృష్ణకు కూతురుగా చేసి.. ఆ తర్వాత ఆయన పక్కన హీరోయిన్గా చేయలేదా ? అని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
మరి కొందరు ఏఎన్నార్ – శ్రీదేవి, నాగార్జున – శ్రీదేవి కాంబినేషన్లు స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు. ఇక కొందరు పవన్ అభిమానులు అయితే ఈ గోలంతా ఎందుకు ? శ్రీలీల ప్లేస్‌లో మాళవిక మోహనన్ ను తీసుకోమని సూచనలు చేస్తున్నారు. కొందరు అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు ? ముందు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయవచ్చు కదా ? అంటున్నారు. ఏదేమైనా పవన్ సినిమాల విషయంలో అన్నీ పెద్ద గందరగోళాలే నడుస్తున్నాయి.