టాలీవుడ్లో సీనియర్ డైరెక్టర్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సినిమాలలో హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసింది. ఎలాంటి గొప్ప స్టార్ హీరోయిన్ అయినా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక్క సినిమాలో అయినా నటించాలన్న కోరికతో ఉంటుంది. ఈ తరంలో కూడా ఎంతోమంది దర్శకులు.. హీరోయిన్లను ఎంత రొమాంటిక్‌గా చూపిస్తున్నా కూడా… రాఘవేంద్రరావు చూపించనంత గొప్పగా చూపించలేరు. హీరోయిన్లను ఎంత అందంగా చూపించాలో అది ఆయనకే సొంతం.
ముఖ్యంగా హీరోయిన్లలో నాభి, నడుము… ఎద అందాలను అదిరిపోయేలా ఎక్స్పోజ్ చేయించడంలో రాఘవేంద్రరావుకు ఆయనే సాటి. రాఘవేంద్రరావు తన సినిమాలలో నటించిన అందరి హీరోయిన్ల నాభిపై పూలు, పండ్లు వేయించారు. అయితే ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం ఆయన ఈ రూల్ ఫాలో అవలేదు. ఆ హీరోయిన్ కు ఏకంగా పాలాభిషేకం చేయించారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమని.
ఆమని – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన సినిమాలో పాలతో ఆమెకు అభిషేకం చేయించేశారు. అంతకుముందే ఆయన దేవత సినిమాలో శ్రీదేవికి బిందెలు వాడి సాంగ్ షూట్ చేశారు. ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్‌కు ఇత్తడి బిందెలు పెట్టి మరీ సాంగ్ షూట్ చేయించారు. అయితే ఆమని సాంగ్‌కు స్టీల్ బిందెలు వాడారు. స్టీలు బిందెలతో పాటు పాలు పైన పోసి అభిషేకం జరిగేలా చేయడం తాను ఎప్పటకీ మర్చిపోలేని థ్రిల్ మూమెంట్ అని ఆమని చెప్పింది.
భీమవరం బుల్లోడా.. నరసపురం నైసమ్మ అనే పల్లవితో సాగిన ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఇప్పటకీ చాలా మంది నోళ్లలో నానుతూనే ఉంటుంది. ఆమని బయట ఫంక్షన్లకు వెళ్లినప్పుడు కూడా మేడమ్ ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేయండి అంటూ రిక్వెస్టులు చేస్తూ ఉంటారట. విచిత్రం ఏంటంటే త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో జూనియర్ ఎన్టీఆర్ కీరవాణి మ్యాజిక్ ఇచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ తనకు ఎందుకో నచ్చదని చెప్పాడు.
ఈ విషయం తెలుసుకున్న ఆమని ఆశ్చర్యానికి గురైంది. ఇంత హిట్ సాంగ్ జూనియర్‌కు ఎందుకు నచ్చలేదబ్బా ? అని షాకింగ్ ఫేస్ పెట్టింది. అలాగే నాగార్జున పక్కన ఆమె కన్నె పిట్టరో అనే ఐటెం సాంగ్ కూడా చేసింది. కెరీర్లో హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే ఈ సాంగ్ చేయడానికి ప్రధాన కారణం తన గురువు ఈవీవీ గారు అడగడంతో పాటు నాగార్జున కావడంతో ఒప్పుకున్నానని ఆమని చెప్పింది.