సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్నప్పటికీ యంగ్ హీరోస్ చేయలేని సాహసాలు చేస్తూ అభిమానుల కోసం ఎంతటి దూరమైనా వెళ్తున్నారు. వీర సిమ్హా రెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. త్వరలోనే ఎన్బికె 108 సినిమాను కూడా రిలీజ్ చేయబోతున్నారు. కాగా తర్వాత మరోసారి బోయపాటితో అఖండ 2 చేయడానికి సిద్ధమవుతున్నాడు బాలకృష్ణ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇదే క్రమంలో బాలకృష్ణ మరోసారి తన ఫేవరెట్ బ్యూటీ ప్రగ్య కి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది .
మనకు తెలిసిందే అఖండ సినిమాతో బాలకృష్ణ ప్రగ్య సూపర్ జోడిగా పేరు సంపాదించుకున్నారు. బయట సినిమాలలో చాలా హాట్ గా కనిపించే ప్రగ్యా బాలయ్య సినిమాలో మాత్రం చాలా కూల్ , క్లాసి గా.. హోమ్లీగా కనిపించింది . 2021 డిసెంబర్ 1న గ్రాండ్గా విడుదలైన అఖండ .. సినిమా టాలీవుడ్ ఇండస్ట్రిని ఓ రేంజ్ లో అల్లాడించింది. బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ గా రికార్డ్ నెలకొల్పింది. అలాంటి బ్యూటీతో మరోసారి బాలయ్య జతకటబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి.
రీసెంట్ గా అఫీషియల్ గా కన్ఫామ్ చేసేసాడు బాలయ్య . రీసెంట్గా ప్రగ్యా తో ట్రెడిషనల్ లుక్స్ లో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ లుక్స్ లో అచ్చం బాలయ్య రాజులా కనిపిస్తున్నాడు . ఆయన పక్కన మహారాణిలా ప్రగ్య చాలా పద్ధతిగా చీరకట్టుకొని ..నగలు పెట్టుకొని ..వడ్డాణం పెట్టుకొని కుందనపు బొమ్మలా కనిపించింది . ఈ క్రమంలో బాలయ్య మరోసారి తన ఫేవరేట్ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చాడు అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.
అయితే ఈసారి సినిమాలో కాదు ఓ కమర్షియల్ యాడ్ కోసం ఇలా జతకట్టబోతున్నట్లు తెలుస్తుంది . వేగ శ్రీ అనే జ్యూవెల్లరి యాడ్ కోసం ఈ జంట మరోసారి సందడి చేయడం విశేషం. ఇద్దరు గ్రాండ్ గా ముస్తాబై ఈ జంట కనిపించారు. ఈ క్రమంలోని వీళ్ళిద్దరి పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఏ మాటకు ఆ మాట బాలయ్య ఈ లుక్స్ లో చాలా ట్రెడిషనల్ గా రాయల్ లుక్ లో కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!