ఆడది తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. పెద్ద పెద్ద యుద్ధాలే వచ్చేస్తాయి. ఇతిహాస గాథల్లో పేరున్న రామాయణ, మహాభారత యుద్ధాలు రెండిటికి సీత, ద్రౌపది కారణం అన్న సంగతి తెలిసిందే. ఆడది తెగిస్తే ఏం జరుగుతుందో ? ఎంతటి వాడిని అయినా తన కొంగుకు ఎలా ముడేసుకుంటుందో చెప్పక్కర్లేదు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఓ హీరోయిన్ ఇలాంటి ప్లాన్లుతోనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందట.
ఆడవాళ్లు ఏదైనా చేసి తాము అనుకున్నది సాధించుకుంటారు. అలాగే ఏడ్చి సాధించలేనిది ఏదీ లేదనే అంటారు. టాలీవుడ్లో ఓ హీరోయిన్ సైతం ఇలాగే ఏడ్చి ఏడ్చి మరీ బంపర్ ఆఫర్ కొట్టేసిందట. పొరుగు ఇంటి నుంచి ఇక్కడకు వచ్చిన ఈ అమ్మడు ఓ పెద్ద సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆ సినిమా దర్శకుడికి కాస్త దగ్గరైనట్టు గుసగుసలు వచ్చాయి.
ఆ దర్శకుడికి మాత్రమే కాదు… హీరోతోనూ అంతే క్లోజ్ అయిపోయిందట. ఎంత క్లోజ్ అంటే చాలా చాలా క్లోజ్. అయితే ఆ హీరోయిన్ పెద్దగా కమర్షియల్ మెటీరియల్ అయితే కాదు. అందుకే మళ్లీ మళ్లీ ఆమెకు ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఈ టైంలోనే ఆ డైరెక్టర్‌తో సంబంధం ఉన్న సినిమాలోకి ఎంటర్ అయ్యేలా గేమ్ ప్లాన్ చేసింది.
ఆ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి కూర్చొని తనకు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడంతో పాటు కన్నీళ్లు కార్చేసిందట. తనకు ఆ ఛాన్స్ ఇవ్వకపోతే లైఫ్ లేదని పదే పదే గుక్కపట్టి ఏడ్చిందట. చివరకు ఆ డైరెక్టర్ రికమెండేషన్‌తో ఆమెను ఆ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేశారని తెలిసింది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా హీరోయిన్లు తలుచుకుంటే ఏం చేసి అయినా ఇలాంటి ఛాన్సులు పట్టేయడంలో ఆరితేరిపోతున్నారు.