టాలీవుడ్‌లో దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. కలియుగ పాండవులు సినిమాతో హీరో అయిన వెంకటేష్ అక్కడ నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. 1980 – 2000 వ దశకం వరకు టాలీవుడ్ టాప్ – 4 హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. ఫ్యామిలీ సినిమాలకు వెంకీ కేరాఫ్ అడ్రస్.
ఒకప్పుడు వెంకీ వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు కొట్టాడు. ఇక రీమేక్ సినిమాలతో ఎన్నో హిట్లు వెంకీ ఖాతాలో పడ్డాయి. ఇక ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీ తట్టుకుని వెంకీ ప్రయోగాత్మక, వైవిధ్యమైన సినిమాల్లోనే నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. కమర్షియల్ పంథాకు దూరంగా ప్రయోగాలు చేయడం, కథాబలం ఉన్న సినిమాలు చేయడం ఇప్పుడు వెంకీకి అలవాటుగా మారింది.
ఇక వెంకటేష్‌కు ఓ స్టార్ నటుడికి పెద్ద ఫ్యాన్. ఆ నటుడు ఎవరో కాదు.. ఆంధ్రుల అందగాడు, అలనాటి నటుడు శోభన్‌బాబు. అప్పట్లో అగ్ర హీరోల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగాడు శోభన్‌బాబు. ముఖ్యంగా ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయే పాత్రలకు శోభన్‌బాబు కేరాఫ్. శోభన్‌బాబు ఎలా అయితే ఫ్యామిలీ కథా చిత్రాలతో మహిళా అభిమానులను సొంతం చేసుకున్నాడో వెంకీ కూడా అదే బాటలో నడిచాడు.
తాజాగా వెంకీ తన అభిమాన హీరో శోభన్‌బాబుతో కలిసి దిగిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. వెంకీకి శోభన్‌బాబు అంటే ఎంతో ఇష్టం. ఆయననే తన ఫేవరెట్ హీరోగా చాలా సందర్భాల్లో చెప్పాడు. మరో విచిత్రం ఏంటంటే వెంకీ నిర్మాతగా నిర్మించిన ఏకైక సినిమా శోభన్‌బాబుతోనే. ఆ విషయం చాలా మందికి తెలియదు. వెంకీ హీరో మాత్రమే కాదు.. నిర్మాత కూడా..!
తన అభిమాన హీరోతో సినిమా నిర్మించేందుకు వెంకీ ఏకంగా ఓ బ్యానరే స్థాపించాడన్నది కూడా ఎవ్వరికి తెలియదు. వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ ఆనే నిర్మాణ సంస్థను స్థాపించిన వెంకటేష్ శోభన్‌బాబు – వాణిశ్రీ జంటగా ‘ఎంకి నాయుడు బావ’ అనే సినిమా నిర్మించారు. ఇదంతా వెంకీ 18 ఏళ్ల వయస్సులోనే జరిగింది. ఆ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు అరుదుగా కనిపిస్తుంటాయి.
ఇక రామానాయుడు సమర్పణలో ఈ ఎంకి నాయుడు బావ సినిమా తెరకెక్కగా.. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు. వెంకీ విదేశాలకు వెళ్లేముందు నిర్మాతగా సెటిల్ అవ్వాలనుకుని తన పేరుతో స్థాపించిన బ్యానర్ మీద ఈ సినిమా నిర్మించారు. ఆ తర్వాత ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లి అక్కడ నుంచి ఇండియాకు తిరిగి వచ్చి హీరోగా సెటిల్ అయ్యారు.