సినిమా ఇండస్ట్రీలో హీరో సూర్యకి ఎలాంటి మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో బోలెడు మంది హీరోలు ఉన్నా సరే.. చాలామంది సూర్య నే ఫేవరెట్ హీరో అని చెప్తూ ఉంటారు. అంతలా తన మార్కెట్ ని తెలుగు లో కూడా పెంచుకున్నాడు ఈ కోలీవుడ్ స్టార్ హీరో . మరీ ముఖ్యంగా సూర్య ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవడానికి జనాలు చాలా ఇంట్రెస్ట్ చూయిస్తూ ఉంటారు . దానికి మెయిన్ రీజన్ ఆయనలో ఉన్న నిజాయితీ అని చెప్పాలి .
కాగా కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో సూర్య తన తోటి హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళు కలిసి సినిమాలు చేస్తున్న టైంలోనే ప్రేమించుకున్న ఈ జంట ఇంట్లో పెద్దలు తమ పెళ్ళికి ఒప్పుకోరు అని తెలిసి గుడిలో గుట్టూ చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత ఆ విషయం బయటపడి ఫ్యామిలీలో ఉండే పెద్దలు జ్యోతిక – సూర్య తల్లిదండ్రులను ఒప్పించి మరీ గ్రాండ్గా వాళ్ల వివాహం చేశారు .
అయితే సూర్య.. జ్యోతిక కంటే ముందే ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సూర్య తన కాలేజీ చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారని ..అయితే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం చేసుకొని సూర్యని మర్చిపోయిందని.. ఈ కారణంగా ఆయన లవ్ బ్రేకప్ తో కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడని ..ఆ తర్వాత మెల్లగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ సపరేట్ లైఫ్ ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేశారని ..ఈ క్రమంలోనే మంచి మనసున్న జ్యోతికత లవ్ లో పడి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ కోలీవుడ్ వీడియో చెప్పుకొస్తుంది . ఏది ఏమైనా సరే సూర్య జ్యోతిక జంట ఎంతోమంది జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం..!!