సర్కారీ వారి పాట సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరుశురాం తో గీతాగోవిందం 2 సినిమాను తెరకెక్కించాలని ఎంతో ఆత్రుతగా ఉన్నాడు అల్లు అరవింద్. ఈ క్రమంలోని సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్ డీటెయిల్స్ మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు . అయితే రాత్రికి రాత్రి దిల్ రాజు ప్లాన్ మార్చేసి గీతగోవిందం 2 సినిమాను ఆయన నిర్మించే విధంగా అగ్రిమెంట్ రాయించుకొని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు. ఈ దెబ్బకి షాక్ అయినా అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఎడాపెడా కడిగేయాలని ఫిక్స్ అయ్యాడు.
అయితే గిల్ట్ సభ్యుల రిక్వెస్ట్ మేరకు ఈ వివాదాన్ని ఇక్కడితో క్లోజ్ చేశాడు. కానీ ఆ బాధను అల్లు అరవింద్ మర్చిపోలేదు. ఈ క్రమంలోనే పరశురాం అల్లు అరవింద్ ను కూల్ చేయడానికి పరశురాం భార్యతో కలిసి అల్లు ఫామిలీ ఇంటికి వెళ్లారట . అయినా కానీ అల్లు అరవింద్ శాంతపడలేదు . ఈ క్రమంలోనే పరశురాం దగ్గర్నుంచి ఓ మాట తీసుకున్నాడు .గీతాగోవిందం 2 సినిమా కంటే ముందే ఆయన చెప్పిన హీరోతో హిట్ సినిమా ఇవ్వాలని మాట తీసుకున్నారట .
ఈ క్రమంలోనే గీతా గోవిందం 2 సినిమాను ఆపేసి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో అదిరిపోయే సినిమాలు ప్లాన్ చేశారట . రేపో మాపో ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వస్తుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే అల్లు అరవింద్ – పరశురాం సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. దిల్ రాజు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. కానీ మధ్యలో హీరోగా ఫిక్స్ అయిన విజయ్ దేవరకొండ కి పెద్ద బొక్క పడింది . అటు సమంత అనారోగ్య కారణంగా ఖుషి సినిమా షూటింగ్ లేటవుతుంది.. ఇటు గౌతం తిన్నూరితో సినిమా లేట్ అవుతుంది.. ఇప్పుడు గీత గోవిందం టు సినిమా కూడా ఆలస్యం అవుతుంది . ఇలా విజయ్ దేవరకొండకు వరుసగా ముగ్గురు పెద్ద బొక్క పెట్టేసారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!