తారకరత్న చిన్న వయస్సులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. తారక్ ఏజ్ కేవలం 39 ఏళ్లు. చాలా తక్కువ వయస్సులో ఈ జీవిత తెరనుంచి నిష్క్రమించాడు. అయితే తారకరత్న జీవితం అంతా పోరాటాలు, పట్టింపులతోనే గడిచిపోయింది. జూనియర్ ఎన్టీఆర్‌కు పోటీగా తారకరత్నను హీరోగా నిలబెట్టాలని నందమూరి, నారా ఫ్యామిలీలు అనుకున్నాయి. అందుకే ఒకే రోజు ఏకంగా 9 సినిమాలతో ప్రారంభోత్సవం జరుపుకున్న ఏకైక హీరోగా చరిత్రలో నిలిచిపోయాడు.
హీరోగా తారకరత్న నిలదొక్కుకోలేకపోయాడు. ఓ మహానటుడికి, మహా నాయకుడికి మనవడిగా పుట్టినా ఆ ఛరిష్మా అందిపుచ్చుకోలేకపోయాడు. సినిమా రంగంలో హీరోగా సక్సెస్ కాలేదన్న బాధపడలేదు. విలన్‌గా అవతారం ఎత్తి తానేంటో ఫ్రూవ్ చేసుకుని నంది అవార్డులు అందుకున్నాడు. అయితే తారకరత్న సినీ జీవితం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలోనూ తారకరత్న చాలా ఒడిదుడుకులే ఎదుర్కొన్నాడు. పెళ్లి విషయంలో పంతాలతో అటు చాలా యేళ్ల పాటు తండ్రికి దూరంగా ఉన్నాడు. ఇటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా తారకరత్న పెళ్లి ఇష్టంలేక అతడిని తమ ఫ్యామిలీ ఫంక్షన్లకు పూర్తిగా దూరం పెట్టేశారు. అసలే పెద్ద కుటుంబంలో పుట్టాడు. అతడి పుట్టుకే గోల్డెన్ స్పూన్. సినిమా రంగం కాకుండా.. ఇతరత్రా వ్యాపార రంగంలోకి వెళ్లి ఉంటే ఎలా ఉండేదో.. !
నటనలో అనుకున్న స్థాయికి వెళ్లకపోయినా బాబాయ్ బాలయ్య సపోర్ట్ ఎప్పుడూ ఉండేది. పెళ్లి తర్వాత తన కుటుంబంతో అన్నీ బంధాలు వదులుకుని ఎవ్వరూ లేని ఏకాకిగా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడు అయితే కుమార్తె జన్మించి పెద్దది అయ్యిందో అప్పుడే మళ్లీ ఆ ఫ్యామిలీ అతడిని కలుపుకుంది. ఇలా సినిమా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ప్రేమకోసం పోరాటాలు… ఇటు సొంత కుటుంబంతో విబేధాలు ఎన్ని వచ్చినా మొండిగానే జీవితానికి ఎదురీదాడు.
చివరకు రాజకీయాల్లోకి వచ్చి తన లక్ పరీక్షించుకోవాలని అనుకున్నాడు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఇప్పటికే ప్రకటించాడు. ఆ లక్ పరీక్షించుకునే క్రమంలోనే కుప్పం పాదయాత్రకు వెళ్లాడు. అయితే విధి అతడి జీవితంతో ఆడిన వింత నాటకంతో 39 ఏళ్ల వయస్సుకే తొందరపడినట్టు అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు జీవించి ఉన్నన్ని రోజులు ఎలా ? ఉన్నా చనిపోయిన తర్వాత మాత్రం ఘనమైన నివాళి దక్కింది. ఏదేమైనా తారకరత్న మొండితనంతో అందరిని జయించినా విధికి మాత్రం అతడి పోరాటం చూసి కన్నుకుట్టినట్టుగా ఉంది.